వైరస్‌ను పసిగట్టేస్తాయ్‌

తాజా వార్తలు

Updated : 05/05/2020 07:02 IST

వైరస్‌ను పసిగట్టేస్తాయ్‌

దొంగలు, దోషుల్నే కాదు... పేలుడు పదార్థాల జాడనూ వాసనతో గుర్తించే శునకాలు మనుషుల్లోని కరోనా వైరస్‌ను పట్టేయలేవా?.. అని శాస్త్రవేత్తల బుర్రల్లో ఆలోచన తళుక్కుమంది. ఇంకేముంది ఆచరణకు రంగం సిద్ధమైపోయింది. శక్తిమంతమైన వాసన పసిగట్టే గుణం కలిగిన శునక రాజాల్ని ఎంపిక చేసేసి... చకచకా వాటికి తర్ఫీదును ఇవ్వడమూ మొదలైపోయింది. అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన వెటర్నరీ మెడిసిన్‌ విభాగం పరిశోధకులు ఈ విశేష కృషి చేస్తున్నారు. శునకాలు వాసన చూడటం ద్వారా క్యాన్సర్‌ను గుర్తించిన దాఖలాలు 1980ల్లోనే ఉన్నాయి. చాలా కణాలు త్వరగా ఆవిరి అయ్యే సేంద్రియ సమ్మేళనాలు(వీవోసీ)లను కలిగి ఉంటాయి. ఈ విలక్షణ తత్వం మనుషుల రక్తం, లాలాజలం, మూత్రంలోని కణాలకూ సొంతం. వాటి నుంచి వచ్చే వాసనల్ని పసిగట్టడం ద్వారా వైరస్‌ను గుర్తించే శక్తి శునకాలకు ఉందని పెన్సిల్వేనియా యూనివర్సిటీ పరిశోధకులు నొక్కిచెబుతున్నారు. కరోనాను కనుగొనేందుకు ప్రస్తుతం నెగెటివ్‌, పాజిటివ్‌ నమూనాలను శునకాల చెంత ఉంచుతూ వాసన చూపుతూ శిక్షణ ఇస్తున్నారు. మనుషుల్లో 60 లక్షల వాసన గ్రాహకాలు ఉంటే... అదే శునకాల్లో వాటి సంఖ్య 30 కోట్లు. అందుకే శునకాలకు ఏదైనా సాధ్యమవుతుందని పరిశోధకుల మాట. అవి తర్ఫీదును పూర్తి చేసుకుని జులైకల్లా రంగంలోకి దిగుతాయని భావిస్తున్నారు.

 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని