విశాఖ గ్యాస్‌లీక్‌ బాధితులకు పరిహారం చెల్లింపు

తాజా వార్తలు

Published : 13/05/2020 20:23 IST

విశాఖ గ్యాస్‌లీక్‌ బాధితులకు పరిహారం చెల్లింపు

విశాఖ: విశాఖ గ్యాస్‌ లీకేజీ దుర్ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించింది. ఈ మేరకు మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్‌, ఎంపీ విజయసాయిరెడ్డి చెక్కులు అందించారు. ఈ దుర్ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా మూడు రోజుల క్రితమే ఎనిమిది మంది మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం ఇవ్వగా.. మిగిలిన నాలుగు కుటుంబాలకు ఈరోజు అందజేశారు. అలాగే, కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులకు రూ.25 వేలు చొప్పున పరిహారాన్ని అందించారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. ఆస్పత్రుల్లో 585 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారంతా డిశ్చార్జ్‌ అయ్యారన్నారు. కేజీహెచ్‌ నుంచి 287 మంది డిశ్చార్జ్‌కు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఇప్పటికే 8కుటుంబాలకు పరిహారం అందించామని.. మిగతా నాలుగు కుటుంబాలకు రేపు ఉదయం వారి బ్యాంకు ఖాతాకు బదిలీ చేస్తామన్నారు. పరిశ్రమ గోడను ఆనుకొని ఉన్న గ్రామంలోనూ గణన జరుగుతోందన్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని