ఏపీలో 10 నుంచి ఆలయాల్లోకి అనుమతి
close

తాజా వార్తలు

Updated : 06/06/2020 15:31 IST

ఏపీలో 10 నుంచి ఆలయాల్లోకి అనుమతి

విజయవాడ: రాష్ట్రంలో కంటైన్‌మెంట్‌ జోన్లు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఈనెల 10 నుంచి దేవాలయాల్లో భక్తులను అనుమతించనున్నట్లు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు వెల్లడించారు. విజయవాడలోని దేవాదాయ శాఖ కార్యాలయంలో అధికారులతో ఆయన సమావేశమై మాట్లాడారు. ఈనెల 8, 9 తేదీల్లో ఆలయ సిబ్బంది, స్థానిక భక్తులతో ప్రయోగాత్మక దర్శనానికి అనుమతించి లోటుపాట్లను సరిచేస్తామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలకు అనుగుణంగా ఆలయాలకు వచ్చే భక్తులందరూ విధిగా మాస్కులు ధరించడం, చేతులను శుభ్రం చేసుకోవడం సహా భౌతిక దూరం పాటించాలని సూచించారు.

ఆలయ పరిసరాల్లో ఉమ్మివేయడం నిషిద్ధమని మంత్రి తెలిపారు. 65 ఏళ్లు పైబడిన వారు, చిన్నపిల్లలు దర్శనానికి రాకపోవడం మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో శఠగోపం, తీర్థ ప్రసాదాలు ఉండవని మంత్రి స్పష్టం చేశారు. టైం స్లాట్‌ ప్రకారమే భక్తులను దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా భక్తుల దర్శనంపై పరిమితి విధించాల్సి వస్తుందని అన్నారు. ఇందులో భాగంగానే బెజవాడ దుర్గమ్మ ఆలయంలో అమ్మవారి దర్శనానికి గంటకు 300 మంది భక్తులను మాత్రమే అనుమతిస్తున్నట్లు మంత్రి వెల్లంపల్లి స్పష్టం చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని