అభివృద్ధి ఏమైనా నిలిచిపోయిందా: తలసాని

తాజా వార్తలు

Published : 09/07/2020 13:46 IST

అభివృద్ధి ఏమైనా నిలిచిపోయిందా: తలసాని

హైదరాబాద్‌: ఎక్కడి నుంచైనా పరిపాలన చేసే సౌలభ్యం మనకు ఉందని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌, కరోనా, సచివాలయం కూల్చివేత అంశాలపై మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు. వ్యవసాయశాఖ అధికారులతో సీఎం కేసీఆర్‌ నిన్న ఫోన్‌లో మాట్లాడారని తలసాని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆన్‌లైన్‌లో సమీక్షలు జరపట్లేదా అని మంత్రి ప్రశ్నించారు. ‘‘రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా నిలిచిపోయాయా? రాష్ట్ర గౌరవానికి తగినట్లు సచివాలయం ఉంటే తప్పా? భవిష్యత్‌లో ఇంకా చాలా మందికి కరోనా సోకుతుంది. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు’’అని తలసాని వ్యాఖ్యానించారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని