close

తాజా వార్తలు

Published : 05/05/2021 07:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అధికారుల నిర్లక్ష్యం.. మూగజీవులకు శాపం

● కరోనా లక్షణాలున్న సిబ్బందితో జంతు సంరక్షణ

కొవిడ్‌ బారిన పడిన సింహం

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, చార్మినార్‌: నగరంలోని జంతు ప్రదర్శనశాలలోని అధికారుల నిర్లక్ష్యం అక్కడి మూగజీవుల పాలిట శాపంగా మారిందని సిబ్బంది ఆరోపిస్తున్నారు. కరోనా లక్షణాలున్నా.. కొందరు సిబ్బంది విధులు నిర్వర్తించడంతోనే సమస్య తలెత్తిందని, ఆసియా సింహాలు వైరస్‌ బారినపడ్డాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, కొవిడ్‌కు గురైన 8 సింహాల్లో ప్రస్తుతం ఆరు కోలుకున్నాయని, రెండింటి పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు వెల్లడించారు. ముక్కు కారడం, ఆహారం తక్కువగా తీసుకోవడం వంటి సమస్యలను వాటిల్లో గుర్తించామని స్పష్టం చేశారు.

మిగిలిన వాటినీ పరీక్షించాలి..

జూపార్కులో మొత్తం 24 సింహాలున్నాయి. అందులోని 8 సింహాలకు వైద్య పరీక్షలు చేయించగా(3 మగ, 5 ఆడ) వైరస్‌ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అయితే, వాటితో కలివిడిగా తిరిగిన ఇతర సింహాలు, వేర్వేరు ప్రాంతాల్లో ఉండే పులులు, జింకలు, ఏనుగుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించాలని సంరక్షణ సిబ్బంది అధికారులను కోరుతున్నారు. మరోవైపు బాధిత సింహాలకు మరోమారు వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయించాలని జూ అధికారులు నిర్ణయించారు. మంగళవారం వైద్యులు పీపీఈ కిట్లు ధరించి సింహాల బోన్ల వద్దకు చేరుకున్నారు. గతంలో మాదిరిగా సింహాల ముక్కు నుంచి కారే స్రావాలను కాకుండా, వాటి మలవిసర్జనను సేకరించారు. సంబంధిత నమూనాలను సీసీఎంబీకి పంపుతామని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం సింహాలు ఆరోగ్యంగా ఉన్నాయని సీసీఎఫ్‌(చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్స్‌) ఆర్‌.శోభ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని