AP News: తెలుగు ప్రజలకు సేవ చేస్తా: నవనీత్‌కౌర్‌
close

తాజా వార్తలు

Updated : 25/06/2021 11:35 IST

AP News: తెలుగు ప్రజలకు సేవ చేస్తా: నవనీత్‌కౌర్‌

తిరుమల: తెలుగు ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నట్లు మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ, సినీనటి నవనీత్‌కౌర్‌ అన్నారు. తెలుగు ప్రజల వల్లే తనకు పేరొచ్చిందని చెప్పారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తన ఎన్నిక వ్యవహారంలో బాంబే హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో శ్రీవారిని దర్శించుకున్నట్లు నవనీత్‌కౌర్‌ చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లోని రైతులు, మహిళలు, యువతకు సహాయం చేస్తానన్నారు. దేశంలో కరోనా ప్రభావం తగ్గి ప్రజలు సంతోషంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.

శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

నవనీత్‌కౌర్‌తో పాటు పలువురు ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రామ సుబ్రమణియన్‌, ఏపీ మంత్రి వేణుగోపాలకృష్ణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, సినీనటుడు రాజేంద్రప్రసాద్, తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ స్వామివారిని దర్శించుకున్నారు. ప్రముఖులకు తితిదే అధికారులు ఘన స్వాగతం పలికి దర్శనం చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం అందించారు. ఆ తర్వాత తితిదే అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని