ఏపీ గవర్నర్‌తో నిమ్మగడ్డ భేటీ

తాజా వార్తలు

Updated : 23/01/2021 16:03 IST

ఏపీ గవర్నర్‌తో నిమ్మగడ్డ భేటీ

అమరావతి: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి శనివారం తొలిదఫా ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ తో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణపై గవర్నర్‌తో చర్చించినట్లు సమాచారం. గవర్నర్‌తో భేటీ అనంతరం రమేశ్‌ కుమార్‌ తన కార్యాలయానికి వెళ్లారు. ఇవాళ మధ్యాహ్నం 3గంటలకు పంచాయతీ రాజ్‌శాఖ అధికారులతో ఎస్‌ఈసీ భేటీ కానున్నారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు నిన్న హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇవీ చదవండి...
వైకాపా అరాచకాలపై పోరాడుదాం: పవన్‌

రికార్డు స్థాయిలో పెరిగిన పెట్రోల్ ధరTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని