Cyclone Yaas: కోస్తాంధ్ర‌లో రేపు వ‌ర్షాలు

తాజా వార్తలు

Updated : 23/05/2021 15:12 IST

Cyclone Yaas: కోస్తాంధ్ర‌లో రేపు వ‌ర్షాలు

అమ‌రావ‌తి: తూర్పు మ‌ధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్ప‌ పీడ‌నం ఈ రాత్రికి వాయుగుండంగా మారుతుంద‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. ఉత్త‌ర వాయువ్య దిశ‌గా క‌దిలి రేప‌టికి తుపానుగా మారే సూచ‌న‌లు ఉన్నాయ‌ని తెలిపింది. ఆ త‌ర్వాత 24 గంట‌ల్లో తీవ్ర తుపానుగా బ‌ల‌ప‌డుతుంద‌ని తెలిపింది. అనంత‌రం ఉత్త‌ర వాయువ్యంగా క‌దిలి పెను తుపానుగా మారే సూచ‌న‌లున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. ఈ నెల 26న ఉద‌యం ఒడిశా- బెంగాల్ తీరాన్ని తాకే అవ‌కాశం ఉందని.. ఆరోజు సాయంత్రం ఒడిశా- బెంగాల్ మ‌ధ్య తీరం దాట‌వ‌చ్చ‌ని వాతావ‌ర‌ణ‌శాఖ పేర్కొంది. 


ఈ తుపాను ప్ర‌భావం తెలుగు రాష్ట్రాల‌పై ప‌రిమితంగా ఉంద‌న్న వాతావ‌ర‌ణ కేంద్రం.. కోస్తాంధ్ర‌లో రేపు వ‌ర్షాలు ప‌డ‌తాయ‌ని పేర్కొంది. 25, 26 తేదీల్లో ఉత్త‌రాంధ్ర‌లో చెదురుమ‌దురు జ‌ల్లులు కురుస్తాయ‌ని చెప్పింది. తుపాను దృష్ట్యా స‌ముద్ర తీరం అల్ల‌క‌ల్లోల్లంగా ఉంటుంద‌ని తెలిపింది. మ‌త్స్యకారులు వేట‌కు వెళ్ల‌వ‌ద్ద‌ని హెచ్చ‌రించింది. నైరుతి రుతు ప‌వ‌నాలు చురుగ్గా క‌దులుతున్నాయ‌ని ప్ర‌స్తుతం తూర్పు మ‌ధ్య బంగాళాఖాతం వ‌ర‌కు వ్యాపించి ఉన్న‌ట్లు స్ప‌ష్టం చేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని