AP news: పోలవరం పునరావాస బిల్లులు ఆపడం లేదు: షెకావత్

తాజా వార్తలు

Updated : 05/08/2021 21:15 IST

AP news: పోలవరం పునరావాస బిల్లులు ఆపడం లేదు: షెకావత్

దిల్లీ: పోలవరం ప్రాజెక్టు పునరావాసం వివరాలను కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ వెల్లడించారు. లోక్‌ సభలో ఎంపీ రామ్మోహన్‌ నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు.‘‘పునరావాస వివరాలను ఏపీ అందించింది. పోలవరం నిర్వాసిత కుటుంబాలు 1,06,006 ఉన్నాయి. వారిలో ఇప్పటి వరకు 4,283 కుటుంబాలకే పునరావాస సాయం అందింది. ప్రాజెక్టు పునరావాస ఖర్చును 2014 నుంచి తిరిగి చెల్లిస్తున్నాం. ఏపీ నుంచి వచ్చిన బిల్లులను ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నాం. పీపీఏ, సీడబ్ల్యూసీ తనిఖీ తర్వాత బిల్లులు చెల్లిస్తున్నాం. భూసేకరణ, పునరావాసం కింద రూ.11,181 కోట్లు చెల్లించాం. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల పనులకు గుత్తేదారులు రావట్లేదు. కొన్ని పనులకు ఎన్ని సార్లు బిడ్లు ఆహ్వానించినా టెండర్లు రావట్లేదు’’ అని షెకావత్‌ వెల్లడించారు.

అనుమతుల్లేని ప్రాజెక్టులు ఆపాల్సిందే

కృష్ణా పరివాహక ప్రాంత ప్రాజెక్టులపై గెజిట్‌ వివరాలను కేంద్రం వెల్లడించింది. కృష్ణా పరివాహక ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై నల్గొండ ఎంపీ ఉత్తమ్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ సమాధానమిచ్చారు. కృష్ణా నదిపై అనుమతులు లేని ప్రాజెక్టులు ఆపాల్సిందేనని స్పష్టం చేశారు. ఆరు నెలల్లో అనుమతులు తెచ్చుకోలేకపోతే నిర్వహణ ఆపాలని అన్నారు. గత నెలలో విడుదల చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌లో ఇదే విషయం స్పష్టం చేశామన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని