‘సంగం’.. పాల ఉత్ప‌త్తిదారుల ఆస్తి: ధూళిపాళ్ల‌

తాజా వార్తలు

Updated : 29/05/2021 21:19 IST

‘సంగం’.. పాల ఉత్ప‌త్తిదారుల ఆస్తి: ధూళిపాళ్ల‌

విజ‌య‌వాడ‌: సంగం డెయిరీ పాల ఉత్ప‌త్తిదారుల‌ ఆస్తి అని ఆ డెయిరీ ఛైర్మ‌న్‌, తెదేపా సీనియ‌ర్ నేత ధూళిపాళ్ల న‌రేంద్ర అన్నారు. డెయిరీలో జూన్ 1 నుంచి కిలో వెన్న‌కు రూ.710 చెల్లించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలిపారు. విజ‌య‌వాడ‌లో ధూళిపాళ్ల నేతృత్వంలో సంగం డెయిరీ పాల‌క వ‌ర్గం ఇవాళ స‌మావేశ‌మైంది. ప్ర‌భుత్వం ప‌రంగా ఎదుర‌య్యే అడ్డంకుల‌ను అధిగ‌మించాల‌ని ఇందులో తీర్మానించారు. ఈ సంద‌ర్భంగా న‌రేంద్ర‌ మాట్లాడుతూ.. ప‌ది శాతం వెన్న ఉన్న గేదె పాలు లీట‌ర్‌కు రూ.71.50 చెల్లిస్తామ‌న్నారు. ప‌శుదాణాకు సేక‌రించే మొక్క‌జొన్న‌ల ధ‌ర రూ.1,700గా నిర్ణ‌యించామ‌న్నారు. ఈ ఏడాది రూ.2 వేల ట‌న్నుల మొక్క‌జొన్న కొనుగోలుకు నిర్ణయం తీసుకున్నామ‌ని ఆయ‌న‌ చెప్పారు. 

త్వ‌ర‌లోనే కుప్పంలో పాల శీత‌లీక‌ర‌ణ కేంద్రం ఏర్పాటు చేస్తామ‌ని న‌రేంద్ర‌ వెల్ల‌డించారు. నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరిలో ఐదు వేల లీట‌ర్ల సామ‌ర్థ్యంతో బ‌ల్క్ కూల‌ర్ ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. 50 శాతం రాయితీతో పాలు పితికే యంత్రాలు, బ్ర‌ష్ క‌ట్ట‌ర్లు పంపిణీ చేస్తామ‌ని ఆయ‌న వివ‌రించారు. ఇదిలా ఉంటే డెయిరీలో అక్ర‌మాలు చోటుచేసుకున్నాయ‌ని అరెస్టు అయిన న‌రేంద్ర ఇటీవ‌ల బెయిల్‌పై విడుద‌ల అయిన విష‌యం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని