ఫిబ్రవరి 2 నుంచి శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు: చినజీయర్‌ స్వామి

తాజా వార్తలు

Updated : 20/09/2021 14:22 IST

ఫిబ్రవరి 2 నుంచి శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు: చినజీయర్‌ స్వామి

ముచ్చింతల్‌: నేటి నుంచి తమ ఆశ్రమంలో చాతుర్మాస దీక్ష ప్రారంభిస్తున్నట్లు త్రిదండి చినజీయర్‌స్వామి తెలిపారు. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు సమతామూర్తి పేరిట భగవత్‌ శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని ఆశ్రమంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చినజీయర్‌ స్వామి మాట్లాడారు. ఫిబ్రవరి 5న రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరిస్తారన్నారు.

 ‘‘1017లో రామానుజాచార్యులు అవతరించి 121 ఏళ్లపాటు భూమిపై ఉన్నారు. ఆయన సమతాస్ఫూర్తిని ఎంతో మంది మేధావులు అంగీకరించారు. చిన్న వయసులోనే ఆయనలో అద్భుత ప్రతిభాపాటవాలు ఉండేవి. రామానుజాచార్యులు కేవలం పండితులే కాదు.. అద్భుతమైన ప్రజ్ఞాశాలి. సమతా సిద్ధాంతాన్ని లోకానికి చాటిన మహనీయులు ఆయన’’ అని చెప్పారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని