Teenmar mallanna: తీన్మార్‌ మల్లన్నపై పోలీసులకు ఫిర్యాదు

తాజా వార్తలు

Updated : 24/08/2021 21:36 IST

Teenmar mallanna: తీన్మార్‌ మల్లన్నపై పోలీసులకు ఫిర్యాదు

హైదరాబాద్‌: తీన్మార్‌ మల్లన్నపై పోలీసులకు మరో ఫిర్యాదు అందింది. సీఎం కేసీఆర్‌ను కించపరిచేలా వీడియోలు రూపొందిస్తున్నారని తెరాస సోషల్‌ మీడియా విభాగం సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జర్నలిస్టు వృత్తిని అడ్డుపెట్టుకుని యూట్యూబ్ అడ్డాగా సీఎంపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అతనిపై నమోదైన కేసుల నుంచి తప్పించుకునేందుకు, ప్రజల దృష్టిని మరల్చేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని తెరాస సోషల్‌ మీడియా కన్వీనర్లు తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం కాకుండా మల్లన్నపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సైబర్‌ క్రైమ్‌ ఏసీపీని కోరారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని