తెలుగు రాష్ట్రాల్లో మరో 3రోజులు వర్షాలు

తాజా వార్తలు

Published : 18/07/2021 16:34 IST

తెలుగు రాష్ట్రాల్లో మరో 3రోజులు వర్షాలు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో రాగల 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణకేంద్రం తెలిపింది. మధ్యప్రదేశ్‌ నుంచి విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్రమట్టానికి 900 మీటర్ల ఎత్తులో  ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఈనెల 21న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాగల 3రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఇవాళ, ఎల్లుండి ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు వెల్లడించారు. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్‌లో..

ఉత్తరాంధ్ర తీరప్రాంతం, పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో ఈనెల 21న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతి వాతావరణకేంద్రం అధికారులు తెలిపారు. మరో వైపు ఉత్తర మధ్య మహారాష్ట్ర పరిసరాల్లో ఆవర్తనం బలహీనపడింది. దీని ప్రభావంతో వచ్చే మూడు రోజుల్లో తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ వెల్లడించింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని