Secundrabad Bonalu: వైభవంగా శ్రీఉజ్జయిని మహంకాళీ బోనాలు

తాజా వార్తలు

Updated : 25/07/2021 17:52 IST

Secundrabad Bonalu: వైభవంగా శ్రీఉజ్జయిని మహంకాళీ బోనాలు

హైదరాబాద్: చరిత్రాత్మక సికింద్రాబాద్‌ శ్రీఉజ్జయిని మహంకాళీ బోనాల జాతర కనులపండువగా జరుగుతోంది. తెల్లవారుజామున నాలుగు గంటలకే ఆలయ ద్వారాలు తెరుచుకోగా అమ్మవారికి మంగళహారతి ఇచ్చారు. అనంతరం దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డితో కలిసి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుటుంబసమేతంగా తొలి బోనం అందించారు. అమ్మవారికి బంగారు బోనం, పట్టువస్త్రాలు సమర్పించారు. భక్తుల సందడితో మహంకాళీ ఆలయం వద్ద ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. బోనాలతో తరలివచ్చి... ఆడపడుచులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. కొవిడ్‌ కారణంగా గత ఏడాది బోనాలు సమర్పించే అవకాశం లేకపోవడంతో ఈ సారి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

సామాన్య భక్తులతో పాటు ప్రముఖులు కూడా అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కుటుంబసమేతంగా అమ్మవారిని దర్శింకుచున్నారు. టీఎస్‌ మంత్రులు మల్లారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి అమ్మవారికి పట్టవస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సతీమణి శోభ, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌ ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని