ts news: ట్రాఫిక్‌ పోలీసుల నిర్లక్ష్యం.. నిలిచిపోయిన అంబులెన్స్‌లు

తాజా వార్తలు

Published : 24/07/2021 20:20 IST

ts news: ట్రాఫిక్‌ పోలీసుల నిర్లక్ష్యం.. నిలిచిపోయిన అంబులెన్స్‌లు

హైదరాబాద్‌: నగరంలోని మాసబ్‌ట్యాంక్‌ లో డీజీపీ ప్రొటోకాల్‌ కోసం శనివారం సాయంత్రం ట్రాఫిక్‌ పోలీసులు వాహనాలను ఆపేశారు. దీంతో అత్యవసర రోగులున్న రెండు అంబులెన్స్‌లు ట్రాఫిక్‌లో చిక్కుకున్నాయి. అంబులెన్స్‌లో ఉన్న వైద్య సిబ్బంది రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేసుకుంటూ ముందుకు సాగారు. ఈఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో హోం మంత్రి మహమూద్‌ అలీ స్పందించారు. ట్రాఫిక్‌ పోలీసుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబులెన్స్‌ ఘటనపై హోం మంత్రి ఆరా తీశారు. దీనిపై హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ వివరణ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని