Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లోటాప్‌ 10వార్తలు

తాజా వార్తలు

Published : 25/07/2021 20:55 IST

Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లోటాప్‌ 10వార్తలు

1. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు

కాకతీయ శిల్పకళా వైభవం ఖండాంతరాలు దాటింది. అత్యద్భుత శిల్ప సంపదకు చిరునామాగా నిలిచిన ములుగు జిల్లాలోని రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ స్థలంగా యునెస్కో గుర్తించింది. వారసత్వ కట్టడాల విశిష్టతల పరిశీలన కోసం చైనాలోని ఫ్యూజులో వర్చువల్‌గా సమావేశమైన ప్రపంచ హెరిటేజ్‌ కమిటీ ఈమేరకు నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో వారసత్వ గుర్తింపు పొందిన తొలి కట్టడంగా రామప్ప రికార్డు సృష్టించింది.

రామప్పకు యునెస్కో గుర్తింపుపై కేసీఆర్‌ హర్షం

2. వైభవంగా శ్రీఉజ్జయిని మహంకాళీ బోనాలు

చరిత్రాత్మక సికింద్రాబాద్‌ శ్రీఉజ్జయిని మహంకాళీ బోనాల జాతర కనులపండువగా జరుగుతోంది. తెల్లవారుజామున నాలుగు గంటలకే ఆలయ ద్వారాలు తెరుచుకోగా అమ్మవారికి మంగళహారతి ఇచ్చారు. అనంతరం దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డితో కలిసి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుటుంబసమేతంగా తొలి బోనం అందించారు.

3. ap: కొత్తగా 2,252 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 84,858 మంది నమూనాలు పరీక్షించగా 2,252 కొత్త కేసులు నమోదయ్యాయి. 15 మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 2,440 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 22,155 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. 

4. రూ.2వేల కోట్లు ఇస్తే రాజీనామా చేస్తా: రాజగోపాల్‌రెడ్డి

హుజూరాబాద్‌లో రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు.. మునుగోడు నియోజకవర్గానికి రూ.2వేల కోట్లు ఇస్తానంటే తాను రాజీనామా చేస్తానని మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మనుగోడు అభివృద్ధికి ఎన్నిసార్లు అడిగినా నిధులు ఇవ్వట్లేదన్నారు.

5. లక్షమందితో దళిత, గిరిజన దండోరా: రేవంత్‌రెడ్డి

ఆగస్టు 9న ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ఇంద్రవెల్లి గడ్డపై లక్ష మందితో దండు కట్టి దళిత, గిరిజన దండోరా నిర్వహిస్తామని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావును సికింద్రాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా రేవంత్‌రెడ్డి కలిశారు.  అనంతరం చిరాన్‌ పోర్ట్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మంచిర్యాల జిల్లా కాంగ్రెస్‌ పార్టీ సమావేశానికి రేవంత్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

6. మయన్మార్‌లో చొచ్చుకొస్తున్న చైనాపై ఓ కన్నేసి పెట్టాలి!

మయన్మార్‌లో చైనా చొచ్చుకు రావడంపై భారత్‌ ఓ కన్నేసి పెట్టాలని చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌ సూచించారు. ఒక సంస్థ ఏర్పాటు చేసిన వెబినార్‌లో మాట్లాడుతూ.. ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరిలో మయన్మార్‌లో సైనిక తిరుగుబాటు తర్వాత అంతర్జాతీయ ఆంక్షలు విధించారు. కష్టాల్లో ఉన్న మయన్మార్‌కు బీఆర్‌ఐ ప్రాజెక్టులోకి తీసుకొస్తోందని రావత్‌ తెలిపారు.

7. HDFC Bank: ఆదిత్య పురికి అత్యధిక వేతనం..!

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మాజీ సీఈవో ఆదిత్య పురి టాప్‌ ప్రైవేటు బ్యాంకుల్లో అత్యధిక వేతనం పొందిన వ్యక్తిగా నిలిచారు. కొవిడ్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న 2020లో ఆయన రూ.13.82 కోట్లను అందుకొన్నారు. అక్టోబర్‌లో పురి పదవీ విరమణ చేశాక ఆయన స్థానంలో వచ్చిన శశిధర్‌ జగదీశన్‌ స్థూల వేతనం రూ. 4.77 కోట్లు వార్షిక వేతనం అందుకొన్నారు.

8. చిన్నారుల ఆధార్‌.. బయోమెట్రిక్‌ అప్‌డేట్ చేశారా? 

ప్రస్తుతం దేశంలో ప్రతి పథకానికి ఆధార్ తప్పనిసరి. అప్పుడే పుట్టిన చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ ప్రతి ఒక్కరి ఆధార్‌ కార్డ్ ఉండాల్సిందే. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఐదేళ్లలోపు చిన్నారుల కోసం నీలి రంగుల్లో బాల్ ఆధార్‌ కార్డ్ తీసుకొచ్చింది. తాజాగా బాల్‌ ఆధార్‌ కార్డ్ ఉండి ఐదేళ్ల వయసున్న చిన్నారుల తల్లిదండ్రులు తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్‌డేట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం కోరింది.

9. మహేశ్‌-రాజమౌళి సినిమా కథ.. హింట్‌ ఇచ్చిన విజయేంద్రప్రసాద్‌

కొన్ని సినిమాలు, కాంబినేషన్‌లు పట్టాలెక్కక ముందే వార్తల్లోకెక్కుతాయి. అలాంటిదే ఈ చిత్రం. దర్శకధీరుడు రాజమౌళి, అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు కలయికలో ఓ సినిమా త్వరలో రాబోతున్న విషయం సినిమా ప్రియులందరికీ తెలిసిందే. ఇప్పటికే ఆ విషయాన్ని రాజమౌళి స్వయంగా ప్రకటించారు కూడా. అయితే.. ప్రకటన మినహా సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. 

10. IPL 2021: ముంబయి, చెన్నై మధ్య తొలి మ్యాచ్‌! 

కరోనా కేసుల కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయిన ఐపీఎల్‌ 2021 మిగతా సీజన్‌ సెప్టెంబర్‌ 19 నుంచి తిరిగి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్‌ 15 వరకూ జరిగే ఈ మెగా టోర్నీలో ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ తొలి మ్యాచ్‌లో తలపడుతున్నట్లు తెలిసింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 9న మొదలైన 14వ సీజన్‌లో సగం మ్యాచ్‌లు పూర్తయ్యేసరికి బయోబుడగలో పలువురు ఆటగాళ్లు వైరస్‌ బారిన పడ్డారు.

IND vs SL:  లైవ్‌బ్లాగ్‌ కోసం క్లిక్ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని