Top 10 News @ 9 PM

తాజా వార్తలు

Updated : 21/04/2021 21:13 IST

Top 10 News @ 9 PM

1. యశోద ఆస్పత్రికి సీఎం కేసీఆర్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌లోని సోమాజీగూడ యశోద ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ నెల 19న సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీటీ స్కాన్‌, ఇతర పరీక్షల కోసం సీఎం యశోద ఆస్పత్రికి వచ్చారు. అంతకుముందు ఆయనకు వ్యవసాయ క్షేత్రంలోనే కొన్ని ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. అయితే వైరస్‌ తీవ్రతను తెలుసుకునేందుకు సీటీ స్కాన్‌ సహా ఇతర పరీక్షలు నిర్వహించాలని వైద్యులు సూచించిన నేపథ్యంలో ఆయన యశోద ఆస్పత్రికి వచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. వ్యాక్సినేషన్‌ తర్వాత 0.04% మందికే కొవిడ్‌

కరోనా నుంచి రక్షణ పొందేందుకు టీకా తీసుకుంటున్నప్పటికీ పలువురు వైరస్‌ బారిన పడుతున్నారు. దీంతో వ్యాక్సిన్‌ సమర్థతపై ప్రజల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి. టీకా తీసుకున్నాక కూడా వైరస్‌ బారిన పడినట్లయితే ఇక టీకా తీసుకుని లాభమేంటన్న భావన ప్రజల్లో నెలకొంటోంది. దీంతో కొందరు టీకా తీసుకునే విషయంలో వెనకడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం కీలకమైన డేటాను విడుదల చేసింది. రెండు డోసుల టీకా తీసుకున్న వారు స్వల్ప సంఖ్యలోనే వైరస్‌ బారిన పడుతున్నారని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ​​​​​​Oxygen కొరత.. ఇప్పుడే ఎందుకిలా..?

3. బీమా పాలసీలకు కరోనా దెబ్బ

ప్రకాశ్‌.. ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. ముంబయిలో ఓ మీటింగ్‌కు వెళ్లడంతో గత ఫిబ్రవరిలో కరోనా సోకింది.  కొన్ని రోజుల్లో నయమైపోయింది. మార్చిలో ఆతడికి వివాహమైంది. తనకంటూ ఓ కుటుంబం ఏర్పడంతో భరోసా కోసం ఓ టర్మ్‌ పాలసీ తీసుకుందామని బీమా సంస్థకు వెళ్లాడు. కానీ, వాళ్ల మాట విని ఆశ్చర్యపోయాడు. ‘ఇప్పుడు పాలసీ ఇవ్వలేము.. తొమ్మిది నెలలు ఆగిన తర్వాత రండి’  ఇదీ వారి సమాధానం. నిజానికి ఏ బీమా సంస్థలైనా పాలసీ తీసుకుంటామంటే.. పరుగెత్తుకుంటూ వస్తాయి. అలాంటిది కరోనా మహమ్మారి పరిస్థితులను తలకిందులు చేసేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఏపీలో 9,716 కేసులు.. 38 మరణాలు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. వైరస్‌ బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అంతేకాకుండా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 39,619 పరీక్షలు నిర్వహించగా.. 9,716 కేసులు నిర్ధారణ కాగా.. 38 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 9,86,703 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. పల్సర్‌ ఎన్‌ఎస్‌ 125 ధర రూ.93,690

బజాజ్‌ ఆటో తమ కొత్త పల్సర్‌ ఎన్‌ఎస్‌ 125 మోటార్‌సైకిల్‌ను మంగళవారం విపణిలోకి విడుదల చేసింది. దీని ధర రూ.93,690 (ఎక్స్‌-షోరూమ్, దిల్లీ). ఈ బైక్‌ 125 సీసీ బీఎస్‌-6 డీటీఎస్‌-ఐ ఇంజిన్‌తో రూపొందిందని, 12 పీఎస్‌ సామర్థ్యం, 11 ఎన్‌ఎమ్‌ గరిష్ఠ టార్క్‌ దీని సొంతమని కంపెనీ తెలిపింది. నైట్రాక్స్‌ మోనో-షాక్‌ అబ్జార్బర్స్‌ ఉండటంతో అధిక వేగంతో వెళ్లినా, స్థిరమైన ప్రయాణ అనుభూతి పొందవచ్చని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఆ 4 రాష్ట్రాల్లో.. అందరికీ టీకా ఉచితంగానే

దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చిన వేళ వైరస్‌ను తరిమికొట్టగల వ్యాక్సినేషన్‌ ప్రక్రియను కేంద్రం మరింత విస్తరించింది. మే 1వ తేదీ నుంచి 18ఏళ్లు పైబడిన వారందరూ టీకాలు తీసుకోవచ్చని ప్రకటించింది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్‌పై పలు రాష్ట్రాలు కీలక ప్రకటనలు చేస్తున్నాయి. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా టీకా ఖర్చులు తామే భరిస్తామని ప్రకటించాయి. ఇప్పటికే ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ ఇస్తామని ఉత్తరప్రదేశ్‌, అస్సాం రాష్ట్రాలు ప్రకటించగా.. తాజాగా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ కూడా ఈ జాబితాలో చేరాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ‘ఇదే నా చివరి గుడ్‌ మార్నింగ్‌ కావొచ్చు!’ 

7. ప్రియాంక విరహం.. నిధి ఆనందం

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు- ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన తండ్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు యువ కథానాయకుడు నాని. *‘నిన్ను ఎంతగానో మిస్‌ అవుతున్నాను’ అంటూ నిక్‌ జొనాస్‌ని ఉద్దేశిస్తూ ఓ ఫొటోను పంచుకున్నారు ప్రియాంక చోప్రా. *గతంలో స్విస్‌ పర్వతాల్లో చేసిన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు నటి, మహేశ్‌ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్‌. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Lockdown భయం.. ఖాళీ అవుతున్న నగరాలు

గత అనుభవాలను ఎవరూ మర్చిపోలేదు. చంటి పిల్లలను చంకనేసుకొని వందల కిలోమీటర్లు నడిచిన ఆ చేదు జ్ఞాపకాలు ఇంకా గుర్తున్నాయి. మరోసారి అదే తరహా ప్రమాదఘంటికలు మోగుతున్నాయి. రోజు రోజుకూ కరోనా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఒక్కో రాష్ట్రం రాత్రి కర్ఫ్యూలు, లాక్‌డౌన్లు అంటూ ఆంక్షలు విధించడం మొదలెడుతోంది. దీంతో మరోసారి వలసకార్మికుల నెత్తిన పిడుగుపడినట్లయింది. గతంలో పడిన కష్టాలు మళ్లీ ఎదురవ్వకూడదనే ఉద్దేశంతో పొట్టకూటి కోసం పల్లెటూరిని విడిచి వచ్చిన వలసకార్మికులు మూటాముళ్లూ సర్దుకొని సొంత ఊళ్లకు బయలు దేరుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Corona ఒక్కచోటే 519మందిని చంపేసింది! 

9. మందుల కొరత లేకుండా చర్యలు: బుగ్గన

కొవిడ్‌ కష్టకాలంలో బాధితుల నుంచి ప్రైవేటు ఆస్పత్రులు అధిక మొత్తంలో వసూలు చేయడం సరికాదని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లాలో వైరస్‌ కట్టడిపై ఆయన జిల్లా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. గత ఏడాది కొవిడ్‌ను సమర్థంగా నియంత్రించిన జిల్లాగా కర్నూలు నిలిచిందన్నారు. మందుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో అధిక ఛార్జీల నియంత్రణకు కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. సన్‌రైజర్స్‌ బోణీ.. పంజాబ్‌పై విజయం

ఐపీఎల్‌ 14వ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఎట్టకేలకు విజయం సాధించింది. పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో గెలుపొంది బోణీ కొట్టింది. పంజాబ్‌ నిర్దేశించిన 121 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఒక వికెట్‌ కోల్పోయి 18.4 ఓవర్లలో ఛేదించింది. కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ (37; 37 బంతుల్లో 3x4, 1x6) ఔటైనా.. బెయిర్‌స్టో (63 నాటౌట్‌; 56 బంతుల్లో 3x4, 3x6), కేన్‌ విలియమ్సన్‌ (16 నాటౌట్‌; 19 బంతుల్లో) చివరి వరకు క్రీజులో నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చారు. దాంతో హైదరాబాద్‌ ఈ సీజన్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని