Nirav Modi: నీరవ్‌ మోదీ కేసులో కీలక పరిణామం

తాజా వార్తలు

Published : 09/08/2021 22:06 IST

Nirav Modi: నీరవ్‌ మోదీ కేసులో కీలక పరిణామం

భారత్‌కు అప్పగించాలనే తీర్పుపై అప్పీల్‌కు యూకే హైకోర్టు అనుమతి

లండన్‌: తనను భారత్‌కు అప్పగించాలన్న తీర్పుపై అప్పీల్‌ చేసుకునేందుకు నీరవ్‌ మోదీకి యూకే హైకోర్టు సోమవారం అనుమతిచ్చింది. ఆయన మానసిక స్థితి అంశాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ అవకాశం కల్పించింది.  ‘నీరవ్‌ ఇప్పటికే తీవ్ర కుంగుబాటుకు గురయ్యారు.  ఈ సమయంలో ఆయన్ను తరలిస్తే.. మానసిక ఆరోగ్యంపై మరింత ప్రభావం పడుతుంది.  పైగా ముంబయిలోని ఆర్థర్‌ రోడ్‌ జైలులో కొవిడ్‌ తీవ్రత ఎక్కువగా ఉంది.  అక్కడికి తరలిస్తే ఆత్మహత్య ఆలోచనలు అధికమయ్యే ప్రమాదం ఉంద’ని ఆయన తరఫు న్యాయవాది ఎడ్వర్డ్‌ ఫిట్జ్‌గెరాల్డ్‌ గత నెలలో హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.  భారత్‌ తరఫున వాదిస్తున్న ఇంగ్లాండ్ క్రౌన్‌ ప్రాసిక్యూషన్‌ సర్వీస్‌.. ఈ విషయాలను తోసిపుచ్చింది. ఆయన అప్పీల్‌ను తిరస్కరించాలని న్యాయమూర్తిని కోరింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును రూ.13,500 కోట్ల మేర మోసం చేసిన కేసులో వజ్రాల వ్యాపారి అయిన నీరవ్‌ ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. దేశం విడిచి వెళ్లిపోయిన ఆయన 2019 మార్చినుంచి ఆయన అక్కడి వాండ్స్‌వర్త్‌ జైల్లో ఉంటున్నారు. ఆయన్ను భారత్‌కు అప్పగించాలంటూ యూకే కోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని