గుండె తరలించిన మెట్రో బృందానికి కేటీఆర్‌ ప్రశంస

తాజా వార్తలు

Published : 03/02/2021 21:23 IST

గుండె తరలించిన మెట్రో బృందానికి కేటీఆర్‌ ప్రశంస

హైదరాబాద్‌: హైదరాబాద్‌ మెట్రో రైలు బృందాన్ని మంత్రి కేటీఆర్‌ అభినందించారు. నాగోలు నుంచి జూబ్లీహిల్స్‌ వరకు మెట్రోలో ప్రత్యేక ఏర్పాట్ల మధ్య గుండెను తరలించి ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడినందుకు ప్రశంసించారు. హెచ్ఎమ్‌ఆర్‌ఎల్‌ ఎండీ ఎన్‌వీఎస్‌ఎస్‌ రెడ్డితోపాటు కేవీబీ రెడ్డిని కేటీఆర్‌ అభినందించారు. అవయవ దాత నర్సిరెడ్డి కుటుంబానికి ట్విటర్‌లో హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఎల్‌బీనగర్‌లోని కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జీవన్‌మృతి చెందిన నర్సిరెడ్డి గుండెను దానం చేయడానికి ఆయన కుటుంబసభ్యులు అంగీకరించారు. జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో ఓ వ్యక్తికి గుండె మార్పిడి చేయాల్సి ఉండగా ఆసుపత్రి వర్గాలు మెట్రోను సంప్రదించాయి. దీంతో 21 కిలోమీటర్లు మెట్రోలో తీసుకెళ్లేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గుండెను ఆంబులెన్స్‌లో కామినేని ఆసుపత్రి నుంచి నాగోల్‌లోని మెట్రో స్టేషన్‌కు తీసుకొచ్చి అక్కడి నుంచి మెట్రోలో జూబ్లీహిల్స్‌ స్టేషన్‌ వరకు తరలించారు. అక్కడి నుంచి ఆంబులెన్స్‌లో అపోలో ఆసుపత్రికి తరలించారు.

ఇవీ చదవండి...

మెట్రో సహృదయ స్పందన

ఆధార్‌ కేంద్రాల వద్ద ప్రజల బారులు
 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని