close

తాజా వార్తలు

ఏబీఎన్‌, టీవీ-5 ఛానళ్లపైఅప్రకటిత నిషేధంపై నిరసన

జర్నలిస్టు సంఘాలు, రాజకీయ పార్టీల నాయకుల ప్రదర్శన

 

నెల్లూరు(ఫత్తేఖాన్‌పేట), న్యూస్‌టుడే : రాష్ట్ర ప్రభుత్వం ఏబీఎన్‌, టీవీ-5 ఛానళ్లపై విధించిన అప్రకటిత నిషేధాన్ని రద్దు చేయాలని కోరుతూ సోమవారం జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టు సంఘాలు, తెలుగుదేశం, భాజపా, సీపీఎం, సీపీఐ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. తహసీల్దార్లకు వినతిపత్రాలు అందించారు. నెల్లూరు నగరంలోని గాంధీబొమ్మ సెంటరు నుంచి కలెక్టరేట్‌ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో నుడా మాజీ ఛైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్‌, సీపీఎం నగర, గ్రామీణ కార్యదర్శులు మూలం రమేష్‌, మాదాల వెంకటేశ్వర్లు, సీపీఐ నాయకులు వి.రామరాజు, మునీర్‌తో పాటు ఏపీయూడబ్ల్యూజే నాయకులు జయప్రకాష్‌, ఏబీఎన్‌, టీవీ-5 ప్రతినిధులు పాల్గొన్నారు. కావలిలో పొట్టి శ్రీరాములు బొమ్మ వద్ద నుంచి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. గూడూరులో మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్‌ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. వెంకటగిరిలో మార్కెట్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ రాజేశ్వరరావు, తెదేపా యువత జిల్లా ఉపాధ్యక్షులు కేవీకే ప్రసాద్‌ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించి తహసీల్దారు కార్యాలయం ముందు మోకాళ్లపై నిల్చుని నిరసన వ్యక్తం చేశారు. సూళ్లూరుపేటలో సీపీఎం, సీపీఐ, భాజపా, తెదేపా నాయకుల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఆత్మకూరులో పురపాలకసంఘం మాజీ ఛైర్మన్లు చంద్రారెడ్డి, సందాని, సీపీఐ నాయకులు రామ్మూర్తి, బీఎస్పీ నాయకులు మాలకొండయ్య ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలంలో తెదేపా నాయకులు గుమ్మడి రాజాయాదవ్‌, భాజపా నాయకులు కుంచె శ్రీనివాసులుయాదవ్‌, సీపీఎం మండల కార్యదర్శి ఖాజామస్తాన్‌ ఆధ్వర్యంలో ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. కోవూరు, ఉదయగిరిలో మీడియా ప్రతినిధులు నిరసన వ్యక్తం చేసి స్పందన కార్యక్రమాల్లో వినతిపత్రాలను అందించారు.


జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.