ప్రధానాంశాలు

Published : 04/05/2021 01:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
Corona: IPL విషయంలో వెనుకడుగే లేదు 

తేల్చి చెప్పిన ఫ్రాంఛైజీలు

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌లో ఆటగాళ్లు కరోనా బారిన పడినా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని పలు ఫ్రాంచైజీలు  తేల్చి చెప్పాయి. సోమవారం ఇద్దరు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆటగాళ్లకు కొవిడ్‌-19 నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఆర్సీబీతో జరగాల్సిన మ్యాచ్‌ వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే టోర్నీ నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఇప్పటికే సగం టోర్నీ ముగిసిందని, మిగిలిన మ్యాచ్‌లను కూడా ఇలాగే నిర్వహిస్తామని పలు ఫ్రాంచైజీలు పేర్కొన్నాయి.

‘ఇప్పటికే సగం సీజన్‌ పూర్తయింది. దాంతో ఇలా మధ్యలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. ఇద్దరు కోల్‌కతా ఆటగాళ్లు వైరస్‌ బారిన పడటం అనేది బీసీసీఐకి పెను సవాలుగా మారింది. మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఓ ఆటగాడిని బయోబబుల్‌ నుంచి బయటకు తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. దాంతో అతడికి పాజిటివ్‌గా తేలిందని తెలిసింది. మాకు తెలిసినంత వరకు ఆటగాళ్లంతా బీసీసీఐ నిర్దేశించిన కచ్చితమైన నియమాలు పాటిస్తున్నారు. ఎక్కడా నిబంధనలు అతిక్రమించలేదు’ అని ఓ ఫ్రాంచైజీ అధికారి పేర్కొన్నారు.

‘ఒకవేళ టోర్నీని వాయిదా వేసినా ఎంతకాలం చేస్తారు?ఈ సీజన్‌ సజావుగా సాగాలంటే పాజిటివ్‌గా తేలిన వాళ్లను ఐసోలేషన్‌లో ఉంచాలి. ఇక యథావిధిగా మ్యాచ్‌లు నిర్వహించాలి. సహజంగానే ఆటగాళ్లంతా ఆందోళన చెందుతారు. ఇప్పుడైతే టోర్నీ పూర్తయ్యాక ఇళ్లకు ఎలా వెళ్లాలనేదానిపై సందిగ్ధంలో పడ్డారు’ అని మరో ఫ్రాంఛైజీ అధికారి చెప్పుకొచ్చారు. మరోవైపు ఈ విషయంలో బీసీసీఐ ఏది మంచిదైతే అది చెయ్యాలని, అనవసరంగా దానిముందు అనేక  అభిప్రాయాలు రుద్దరాదని మరో అధికారి సూచించారు.

ఇవీ చదవండి

Tags :

మరిన్ని

తాజా వార్తలు

మరిన్ని
బిజినెస్‌
మరిన్ని
సినిమా
మరిన్ని

చిత్ర వార్తలు

© 1999 - 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
For Editorial Feedback - eMail: infonet@eenadu.net