
తాజా వార్తలు
దేశీయ విమాన సేవలు పెంచిన కేంద్రం
దిల్లీ: దేశీయ విమానయాన సేవలను 70 నుంచి 80 శాతం వరకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. కొవిడ్-19 నేపథ్యంలో దేశీయ విమానాలను 70 శాతం వరకు నడుపుతున్నట్లు నవంబర్ 11న మంత్రి చెప్పారు. అయితే కరోనా కేసులు తగ్గుదల దృష్ట్యా విమాన సర్వీసుల సంఖ్యను ఎప్పటికప్పుడు పెంచుతూ వస్తున్నారు. ‘‘కరోనా ఉద్ధృతి నేపథ్యంలో మే 25న కేవలం 30 వేలతో మాత్రమే దేశీయ విమాన ప్రయాణాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఆ సంఖ్య 2.52 లక్షల వరకు చేరిందని’’ ట్విటర్లో పేర్కొన్నారు. మే 25 నుంచి 33 శాతం మాత్రమే దేశీయ సర్వీసులను నడపిన విమానయాన శాఖ రానురాను దేశీయ సర్వీసులను పెంచుకుంటూ వస్తోంది. జూన్ 26న 45 శాతం, సెప్టెంబర్ 2న 60 శాతం వరకు పెంచింది.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
చిత్ర వార్తలు
సినిమా
- ఇండస్ట్రీలో నాకు పోటీ ఎవరో ఇన్నాళ్లకు తెలిసింది
- మరో 6 పరుగులు చేసుంటే..
- నేను తెలుగింటి అల్లుడినే: సోనూసూద్
- సమాధానం కావాలా..నీ దేశానికి వెళ్లిపో
- గబ్బా కాదు..శార్దూల్-సుందర్‌ల దాబా: సెహ్వాగ్
- ఆ వార్తల్లో నిజం లేదు.. మోహన్‌బాబు టీమ్
- ‘ఉప్మాపాప’కు థాంక్స్ చెప్పిన రామ్..
- యాష్ లేకున్నా సుందర్ నష్టం చేశాడు: ఆసీస్
- బైడెన్ తొలి సంతకం వీటిపైనే..!
- డ్రాగన్ ‘ప్లాన్’ ప్రకారమే..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
