
తాజా వార్తలు
టాప్ 10 న్యూస్ @ 1 PM
1. ‘రూ.2లక్షలను 2వేల కోట్లని ప్రచారం చేస్తారా?’
తెదేపా అధినేత చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ నివాసంలో జరిగిన సోదాలకు సంబంధించి ఐటీ శాఖ విడుదల చేసిన పంచనామా రిపోర్టుపై తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. ఐటీ శాఖ దాడుల్లో రూ.2వేల కోట్లు దొరికాయని వైకాపా నేతలు దుష్ప్రచారం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదురోజులు ఐటీ దాడులని సొంత మీడియాలో బూతద్దంలో చూపారని, రూ.2లక్షల నగదుకు 2 వేల కోట్లని ప్రచారం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 26 డొల్ల కంపెనీలు ఉన్నాయని వైకాపా దుష్ప్రచారం అబద్ధాలకు పరాకాష్ఠ అని దుయ్యబట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. దిల్లీ సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం
దిల్లీ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ప్రమాణస్వీకారం చేయించారు. దీంతో వరుసగా మూడోసారి కేజ్రీవాల్ హస్తిన పీఠాన్ని అధిష్టించనట్లైంది. భారీ జనసందోహం మధ్య దిల్లీలోని రాంలీలా మైదానంలో ‘ధన్యవాద్ దిల్లీ’ పేరిట ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. తొలి నుంచి అనుకున్నట్లుగానే కేజ్రీవాల్ తిరిగి పాత మంత్రులనే తన కేబినెట్లోకి తీసుకున్నారు. మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్, గోపాల్ రాయ్, కైలాష్ గెహ్లోత్, ఇమ్రాన్ హుస్సేన్, రాజేంద్ర గౌతమ్ మంత్రులుగా ప్రమాణం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. ‘రౌడీ’ సాయం.. గోల్డ్ మెడల్ గెలిచిన గణేష్
టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ చేసిన ఆర్థిక సాయంతో ఓ యువకుడు కిక్ బాక్సింగ్ పోటీల్లో పాల్గొని గోల్డ్ మెడల్‌ను సొంతం చేసుకున్నాడు. మెదక్ జిల్లాకు చెందిన గణేష్ ఎంబారీ న్యూదిల్లీలో నిర్వహించే అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనాలనుకున్నాడు. ఆ పోటీల్లో పాల్గొనేందుకు ఎంట్రీ ఫీజు కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఈ క్రమంలో గణేష్ ఆర్థిక పరిస్థితుల గురించి తెలుసుకున్న విజయ్ దేవరకొండ.. తనకు చెందిన ‘దేవర ఫౌండేషన్’ తరుఫున ఎంట్రీ ఫీజుకు కావాల్సిన 24 వేల రూపాయలను ఇటీవల గణేష్‌కు అందించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. అమెరికా ఆస్తులే లక్ష్యంగా మరోసారి దాడి!
ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయం లక్ష్యంగా మరోసారి రాకెట్ దాడులు జరిగాయి. ఈ విషయాన్ని అమెరికా రక్షణ విభాగ అధికారులు శనివారం స్వయంగా వెల్లడించారు. గతేడాది అక్టోబరు నుంచి అమెరికా ఆస్తులపై దాడులు జరగడం ఇది 19వ సారి అని తెలిపారు. ఎన్ని రాకెట్లతో దాడి జరిగింది.. ఈ ఘటనలో ఎంతమంది గాయపడ్డారు అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఘటనకు బాధ్యతవహిస్తూ ఇప్పటి వరకు ఎవరూ ప్రకటన చేయలేదు. అగ్రరాజ్యం మాత్రం ఇరాన్ మద్దతుదారుల పనే అని ఆరోపిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. ‘గల్లీబాయ్’కి బ్లాక్‌లేడీ వశం
చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం ఈ ఏడాది అస్సోంలో అట్టహాసంగా నిర్వహించారు. శనివారం సాయంత్రం నిర్వహించిన ఈ వేడుకలో ‘గల్లీబాయ్’ చిత్రం అత్యధికంగా అవార్డులను సొంతం చేసుకుంది. ఎంతో వైభవంగా నిర్వహించిన ఈ వేడుకలో బాలీవుడ్ తారలు సందడి చేశారు. రణవీర్ సింగ్, కార్తీక్ ఆర్యన్, మాధురీ దీక్షిత్ తమ డ్యాన్సులతో అతిథులను అలరించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. దాని గురించి ఆలోచించట్లేదు: మయాంక్
న్యూజిలాండ్ XIతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన టీమ్ఇండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ గతంలో జరిగిన దాని గురించి ఆలోచించట్లేదని చెప్పాడు. టెస్టు సిరీస్‌కు ముందు సన్నాహక మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో మయాంక్(81) అర్ధశతకంతో చెలరేగిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన మయాంక్.. ఇక్కడ ఆడటం చాలా ప్రత్యేకంగా ఉందని, గతంలో జరిగిన దానికి చింతించడంలేదని చెప్పాడు. రెండో ఇన్నింగ్స్‌లో చేసిన 81 పరుగులతో ఆ ఆత్మవిశ్వాసాన్ని టెస్టుల్లోనూ కొనసాగించాలనుకుంటున్నట్లు తెలిపాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. అట్టహాసంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం
8. లారీ,కారు ఢీ: దంపతుల మృతి
కన్నతల్లిని చివరిచూపులు చూసేందుకు వెళ్తూ కుమారుడు, కోడలు అనంత లోకాలకు చేరిన విషాద ఘటన వరంగల్ అర్బన్ జిల్లా పెంచికల్‌పేట సమీపంలో జరిగింది. ఆదిలాబాద్ టీచర్స్ కాలనీలో ఓ వృద్ధురాలు అనారోగ్యంతో మృతి చెందగా.. ఖమ్మంలో నివాసముంటున్న ఆమె కుమారుడు విజయ్ కుటుంబంతో సహా అంత్యక్రియలకు బయల్దేరాడు. పెంచికల్‌పేట గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ.. విజయ్ కారును ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో విజయ్, సునీత దంపతులు అక్కడికక్కడే మృతి చెందగా.. కుమార్తె మౌనిక, కారు డ్రైవర్ తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. పేద పిల్లల చదువుకోసం సైక్లింగ్ ద్వారా విరాళాల సేకరణ
10. ఐపీఎల్ 2020: ఆర్సీబీ షెడ్యూల్ విడుదల
ఈ ఏడాది ఐపీఎల్ 13వ సీజన్ మార్చి 29 నుంచి ప్రారంభమవుతుండగా ఆరంభ మ్యాచ్ ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య వాంఖడేలో జరగనుంది. అలాగే ఫైనల్ మ్యాచ్ మే 24న ఖరారైంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆర్సీబీ తన షెడ్యూల్‌ను ట్విటర్లో పోస్టు చేసింది. ఏయే తేదీల్లో ఏయే జట్లతో తలపడనుందో వెల్లడించింది. ఆర్సీబీ తొలి మ్యాచ్ మార్చి 31న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరగనుండగా రెండో మ్యాచ్ ఏప్రిల్ 5న ముంబయి ఇండియన్స్‌తో జరగనుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి