
తాజా వార్తలు
సంజూ, మనీష్‌ను తొలగించొద్దు..
ఇంటర్నెట్‌డెస్క్: తొలి టీ20లో విఫలమైన సంజూ శాంసన్, మనీష్ పాండేను మిగిలిన మ్యాచ్‌ల్లో తొలగించొద్దని, వారికి సమయం ఇవ్వాలని మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో భారత్ 11 పరుగుల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌పై తన యూట్యూబ్ ఛానల్లో చోప్రా విశ్లేషణ చేశాడు. ఆరుగురు బ్యాట్స్‌మెన్ తర్వాత జడేజా, వాషింగ్టన్ సుందర్ లాంటి ఆటగాళ్లుంటే టీమ్ఇండియా ధాటిగా ఆడాలని, కానీ అలా ఆడలేకపోయిందని అన్నాడు. ధావన్ ఆదిలోనే ఔటయ్యాడని, ఆపై వచ్చిన సంజూ శాంసన్, మనీష్ పాండేల ఆట గురించి తానేమీ మాట్లాడనని చెప్పాడు. వాళ్లకిది తొలి మ్యాచ్ కావడంతో పాటు ఐపీఎల్లో అంతకన్నా మెరుగైన స్థానాల్లో బ్యాటింగ్ చేశారని గుర్తుచేశాడు.
దాంతో తొలి టీ20లో వాళ్లిద్దరికీ కాస్త ఇబ్బందిగా అనిపించి ఉండొచ్చని, ఒక్క మ్యాచ్‌లో అవకాశం ఇచ్చిన తర్వాత తొలగించొద్దని చోప్రా పేర్కొన్నాడు. టీమ్ఇండియా వారికి మరింత సమయం ఇవ్వాలని కోరాడు. అలాగే హార్దిక్, జడేజాను ఐదారు స్థానాల్లో ఆడించాలని, ఆ తర్వాతే సుందర్‌కు అవకాశమివ్వాలని మాజీ క్రికెటర్ అభిప్రాయపడ్డాడు. ఇప్పటికీ టీమ్ఇండియా బ్యాటింగ్ లైనప్ బలంగా ఉందని, కాకపోతే టాప్ఆర్డర్పైనే అధికంగా ఆధారపడిందని చెప్పాడు. ఇక మూడో వన్డేతో పాటు తొలి టీ20లో జడేజా అద్భుతంగా బ్యాటింగ్ చేసినట్లు కొనియాడాడు.
ఇవీ చదవండి..
జడేజా కంకషన్ సబ్‌స్టిట్యూట్‌పై రచ్చ?
నాటి ఆసీస్ లాభం.. కోహ్లీసేనతో నష్టమైందా?