FWICEకి అజయ్‌ దేవ్‌గణ్‌ విరాళం

తాజా వార్తలు

Updated : 02/04/2020 12:18 IST

FWICEకి అజయ్‌ దేవ్‌గణ్‌ విరాళం

ముంబయి: బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవ్‌గణ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ వెస్ట్రన్‌ ఇండియా సినీ ఎంప్లాయిస్‌కు రూ.51 లక్షలు విరాళంగా అందించారు. రోజు రోజుకు విజృంభిస్తోన్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా 21 రోజులపాటు లాక్‌డౌన్‌ విధించిన విషయం విధితమే. లాక్‌డౌన్‌ను స్వాగతిస్తూ దేశవ్యాప్తంగా పలు రంగాలు మూతపడ్డాయి. సినీ పరిశ్రమ సైతం షూటింగ్స్‌ను వాయిదా వేయడంతో ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న రోజువారీ సినీ కార్మికులు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కుటుంబపోషణ భారమై ఇబ్బంది పడుతున్న కార్మికులకు తమ వంతు సాయం చేసేందుకు ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవ్‌గణ్‌ సైతం తనవంతు ఆర్థిక సాయం అందించారు. ఈ మేరకు ఆయన ఫెడరేషన్‌ ఆఫ్‌ వెస్ట్రన్‌ ఇండియా సినీ ఎంప్లాయిస్‌ సంస్థకు రూ.51 లక్షలను విరాళంగా అందించారు.

అజయ్‌ దేవ్‌గణ్‌ విరాళాన్ని అందించారనే విషయాన్ని తెలియజేస్తూ ఎఫ్‌డబ్ల్యూఐసీఈ అధికారి అశోక్‌ పండిట్‌ ఓ ట్వీట్‌ పెట్టారు. ‘5 లక్షల మంది సినీ కార్మికుల సహాయార్థం రూ.51 లక్షలను ఎఫ్‌డబ్ల్యూఐసీఈ సంస్థకు అందించడం మాకెంతో సంతోషంగా ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సాయం చేసేందుకు మీరు ఎప్పుడూ ముందుంటారని మరోసారి నిరూపితమైంది. మీరు రియల్‌ లైఫ్‌ సింగం.’ అని అశోక్‌ పండిట్‌ పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని