
తాజా వార్తలు
నాన్నలా నేనెప్పటికీ అవ్వలేను : అల్లు అర్జున్
హైదరాబాద్: ‘కొడుకు పుట్టిన తర్వాత నాకు ఒక విషయం అర్థమయ్యింది’ అంటూ అల్లు అర్జున్ భావోద్వేగానికి లోనయ్యారు. నటి సమంత అక్కినేని వ్యాఖ్యాతగా ‘ఆహా’ ఓటీటీలో ప్రసారమవుతున్న సెలబ్రిటీ ఛాట్ షో ‘సామ్ జామ్’. తాజాగా ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్తో పాటు అల్లు అరవింద్ పాల్గొని ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
కాగా, షోలో భాగంగా ‘అల వైకుంఠపురములో’ సినిమా సమయంలో ఆయన మాట్లాడిన ఓ వీడియోను ప్రదర్శించగా.. ‘నేను మా నాన్నంత గొప్పవాడిని ఎప్పటికీ అవ్వలేను. ఆయనలో సగం కూడా కాలేను. ఈ ప్రపంచంలోకెల్లా ఆయనంటే నాకెంతో ఇష్టం’ అని ఉద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ అదిరే ఎపిసోడ్ ‘నూతన సంవత్సరం’ కానుకగా జనవరి 1న ఆహా ఓటీటీ వేదికగా ప్రేక్షకులకు కనువిందు చేయనుంది.
Tags :