బెడిసికొట్టిన కిడ్నాప్‌ యత్నం
close

తాజా వార్తలు

Published : 24/07/2020 02:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బెడిసికొట్టిన కిడ్నాప్‌ యత్నం

దిల్లీ: తూర్పు దిల్లీలోని శకర్పూర్‌ ప్రాంతంలో నాలుగేళ్ల చిన్నారిని కిడ్నాప్‌ చేసే యత్నం బెడిసి కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మంగళవారం సాయంత్రం ద్విచక్రవాహనంపై శకర్పూర్‌ ప్రాంతానికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు నాలుగేళ్ల చిన్నారిని తల్లి నుంచి లాక్కుని బైక్‌పై పరారయ్యేందుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన తల్లి ఒక్కసారిగా వారిపై విరుచుకుపడి ..చిన్నారిని లాగేసుకుంది. తల్లి ఎదురు తిరగడంతో బిత్తరపోయిన దుండగులు ద్విచక్రవాహనంపై పారిపోయేందుకు యత్నించారు. 

ఈ తతంగాన్ని దూరం నుంచి గమనించిన అదే కాలనీ వాసి .. రోడ్డుపై స్కూటర్‌ అడ్డు పెట్టి బైక్‌పై పారిపోతున్న దుండగుడిని అడ్డుకుని కిందకు తోసేశాడు. పరుగెత్తుకుంటూ వెళ్తు్న్న మరో దుండగుడిని పట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ, వారిద్దరూ అక్కడినుంచి పరారయ్యారు. ఈ మొత్తం వ్యవహారం అక్కడున్న సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. వారు అక్కడే వదిలివెళ్లిన బైక్‌ ఆధారంగా దుండగులను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని