
తాజా వార్తలు
ఈసీ కార్యాలయం ఎదుట భాజపా ఆందోళన
హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, అధికార తెరాసకు మద్దతు పలుకుతోందని ఆరోపిస్తూ ఎస్ఈసీ కార్యాలయం ఎదుట భాజపా నేతలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తారనే ఉద్దేశంతోనే టీచర్లకు విధులు అప్పగించలేదని ఆరోపించారు. ఎస్ఈసీ, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా భాజపా శ్రేణులు నినాదాలు చేశాయి. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు, ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఇంద్రసేనారెడ్డి తదితర నాయకుల ఆధ్వర్యంలో కార్యకర్తలు ఎస్ఈసీ కార్యాలయంలోకి చొరబడేందుకు యత్నించారు. ఈ క్రమంలో రంగ ప్రవేశం చేసిన పోలీసులు భాజపా కార్యకర్తలను అరెస్టు చేసి గోషామహల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
Tags :
జిల్లా వార్తలు