ఆ ఒప్పందాన్ని మేం ఒప్పుకోం..!
close

తాజా వార్తలు

Updated : 22/09/2020 18:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ ఒప్పందాన్ని మేం ఒప్పుకోం..!

షాంఘై: టిక్‌టాక్‌ కొనుగోలుకు అమెరికా సంస్థలైన ఒరాకిల్‌ కార్పొరేషన్‌, వాల్‌మార్ట్‌ల ఒప్పందాన్ని చైనా ఒప్పుకోకపోవచ్చని అధికారిక పత్రిక గ్లోబల్‌ ట్వీట్‌ చేసింది. ఈ ఒప్పందం అన్యాయమని అభిప్రాయపడింది. కొత్త ఒప్పందం ప్రకారం అమెరికా కంపెనీలతో కలిసి ‘టిక్‌టాక్‌’ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌ ఓ సంస్థను ఏర్పాటు చేయనుంది. దీనిని టిక్‌టాక్‌ గ్లోబల్‌గా వ్యవహరించనున్నారు. దీని బోర్డులో మెజార్టీ వ్యక్తులు అమెరికాకు చెందిన వారే ఉంటారు. దీనిపై గ్లోబల్‌టైమ్స్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది.
‘‘ఈ నిబంధనలు చూస్తే అమెరికా వేధింపుల శైలి.. తర్కం అర్థమవుతుంది. ఇది చైనా జాతీయ భద్రతకు, గౌరవానికి భంగం కలిగిస్తుంది’’ అని గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొంది. ‘‘అమెరికా నుంచి వచ్చిన సమాచారం పరిశీలిస్తే.. ఈ డీల్‌ అనైతికమని అర్థమవుతోంది. వాషింగ్టన్‌ గొంతెమ్మ కోర్కెలు మొత్తం దీనిలో ఉన్నాయి. ఇలాంటి డీల్‌ను బీజింగ్‌ అంగీకరించడం  కష్టం’’ అని ఈ పత్రిక ఎడిటర్‌ హు షిజిన్‌ పేర్కొన్నారు. 

మరోపక్క ఈ డీల్‌కు తన పూర్తి మద్దతు ఉంటుందని స్వయంగా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. ఈ మేరకు టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌, ఒరాకిల్‌, వాల్‌మార్ట్‌ కలిసి అమెరికాలో యాప్‌ కార్యకలాపాలు కొనసాగించేందుకు ఏర్పాటు చేయబోయే కొత్త కంపెనీకి శ్వేతసౌధం సహకారం ఉంటుందన్నారు. దీంతో ఈ మూడు కంపెనీలు కలిసి టెక్సాస్‌ కేంద్రంగా ‘టిక్‌టాక్‌ గ్లోబల్‌’ అనే మరో కొత్త సంస్థను నెలకొల్పుతున్నట్లు తెలిసింది. దీంతో మరో 25 వేల కొత్త ఉద్యోగాలు రాబోయే అవకాశం ఉందని ట్రంప్‌ అన్నారు. పౌరుల సమాచారానికి 100శాతం భద్రత లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

అమెరికా విదేశీ పెట్టుబడుల్ని పర్యవేక్షించే కమిటీ నుంచి అనుమతులు రాగానే టిక్‌టాక్‌ గ్లోబల్‌ కార్యకలాపాలు మొదలు పెడుతుందని వెల్లడించారు. యాప్‌పై విధించిన నిషేధాన్ని వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు శనివారం సాయంత్రం వాణిజ్య శాఖ ప్రకటించింది. 

టిక్‌టాక్‌ గ్లోబల్‌లో 53శాతం వాటాలు అమెరికాకు చెందిన వారికి.. 36శాతం వాటాలు చైనా పెట్టుబడిదారులకు చెందే అవకాశం ఉందని ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న ఓ అధికారి తెలిపారు. ఒక చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌తో పాటు భద్రతా నిపుణులు కూడా బోర్డులో ఉంటారని తెలిపారు. అమెరికా పౌరుల సమాచారాన్ని నిర్వహించడంతో పాటు.. టిక్‌టాక్‌ సోర్స్‌ కోడ్‌ తనఖీని ఒరాకిల్‌ చేపట్టడం తమకు సమ్మతమేనని టిక్‌టాక్‌ వెల్లడించింది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని