కరోనాతో హడలెత్తుతున్న తమిళనాడు, మహారాష్ట్ర
close

తాజా వార్తలు

Published : 11/07/2020 20:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనాతో హడలెత్తుతున్న తమిళనాడు, మహారాష్ట్ర

కొత్తగా 3,965 కేసులు.. 69 మరణాలు

చెన్నై: తమిళనాడును కరోనా మహమ్మారి హడలెత్తిస్తోంది. ఇవాళ కొత్తగా 3,965 పాజిటివ్‌ కేసులు.. 69 మరణాలు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. తమిళనాడు రాజధాని చెన్నైలోనే 1,185 నమోదు కాగా... ఇతర ప్రాంతాల్లో మిగతావి నిర్ధరణ అయినట్లు తెలిపింది. దీంతో ఇప్పటి వరకు తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 1,34,226కి చేరింది. చెన్నైలోనే 76,158 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇప్పటి వరకు 1,898 మంది మృతి చెందారని ప్రభుత్వం తెలిపింది. వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 46,410 మంది చికిత్స పొందుతుండగా.. కరోనా నుంచి 85,915 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మహారాష్ట్రలో కొత్తగా 8,139 కరోనా కేసులు నమోదైటనట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో కరోనా కేసులు 2,46,600కి చేరాయి. ఇవాళ 223 మంది కరోనాతో ప్రాణాలు విడవగా.. మొత్తం 10,116 మంది మృతి చెందారు. కరోనా నుంచి కోలుకుని 1, 36,985 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. వివిధ ఆసుపత్రుల్లో 99,202 మంది చికిత్స పొందుతున్నారు. 

కర్ణాటకలో కొత్తగా 70 మరణాలు
కర్ణాటకలో కొత్తగా 2,798 కరోనా కేసులు.. 70 మరణాలు నమోదయ్యాయి. బెంగళూరులో కొత్తగా 1,533 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 34,951కి చేరింది. కరోనాతో ఇప్పటి వరకు 613 మంది ప్రాణాలు విడిచారు. దిల్లీలో కొత్తగా 1,781 కేసులు.. 34 మరణాలు సంభవించినట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో కరోనా పాజిటివ్‌ కేసులు 1,10,921కి చేరింది. కరోనాతో ఇప్పటి వరకు 3,334 మంది మృతి చెందారు. కరోనా నుంచి 87,692 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 19,895 మంది చికిత్స పొందుతున్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని