ఆ ఘనత వైకాపాకే దక్కుతుంది:చంద్రబాబు
close

తాజా వార్తలు

Published : 05/06/2020 02:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ ఘనత వైకాపాకే దక్కుతుంది:చంద్రబాబు

అమరావతి: పేదలకు ఇళ్ల స్థలాలంటూ భూసేకరణను వైకాపా ప్రభుత్వం కుంభకోణంగా మార్చిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. అధిక ధరకు భూములను ప్రభుత్వంతో కొనిపించి దోపిడీకి పాల్పడ్డారని ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ఇళ్ల స్థలాల పేరుతో ప్రతి నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయాల అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. ఆవ భూముల్లోనే రూ. 400 కోట్ల అవినీతి జరిగిందని నిజరిర్ధారణ కమిటీ తేల్చిందని చెప్పారు. ఇప్పుడు పేదల నుంచి వసూళ్ల దందాకు వైకాపా తెరలేపిందన్నారు. పేదల సంక్షేమంలోనూ దోపిడీకి పాల్పడిన చరిత్ర వైకాపాదేనని దుయ్యబట్టారు. గత ఏడాదిగా ఇళ్ల పనులన్నీ నిలిపివేశారని.. తెదేపాపై ఉన్న అక్కసుతోనే లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వకుండా కక్ష సాధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెదేపా హయాంలో కట్టిన ఇళ్లను క్వారంటైన్‌ కేంద్రాలుగా మార్చారని చంద్రబాబు ఆక్షేపించారు. పేదల కోసం తెదేపా ప్రభుత్వం 29.52 లక్షల ఇళ్లను మంజూరు చేసిందన్నారు. వాటిలో 9.10 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా.. 8 లక్షల గృహ ప్రవేశాలు జరిగాయన్నారు. మరో 20.41 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయన్నారు. తెదేపా చేపట్టిన సామూహిక గృహ ప్రవేశాలు దేశానికే నమూనా అయిందని గుర్తు చేశారు. విశాఖ సహా ఉత్తరాంధ్ర, రాయలసీమలో లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని చంద్రబాబు వివరించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని