close

తాజా వార్తలు

క్యాబ్‌పై సుప్రీంకోర్టుకు కాంగ్రెస్‌

దిల్లీ: పార్లమెంట్‌ ఉభయ సభల ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ బిల్లు (క్యాబ్‌)పై కాంగ్రెస్‌ పార్టీ సుప్రీం కోర్టులో సవాల్‌ చేయనుంది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సంతకంతో చట్టరూపం దాల్చనున్న ఈ బిల్లుపై తాము సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ బిల్లు న్యాయ సమీక్ష ముందు నిలవదని ఇది వరకే ఆ పార్టీ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

పొరుగు దేశాల నుంచి శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఈ బిల్లు తొలుత లోక్‌సభలో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. రాజ్యసభలో తగిన సంఖ్యాబలం లేనప్పటికీ కేంద్రం తన పంతం నెగ్గించుకుంది. 125-99తో బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఇప్పటికే ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ (ఐయూఎంఎల్‌) బుధవారం సర్వోన్నత న్యాయస్థానంలో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ బిల్లు ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని ఐయూఎంఎల్‌ తన పిటిషన్‌లో పేర్కొంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.