close

తాజా వార్తలు

‘నేను నిర్మల.. నిర్మలగానే ఉంటా’

మా పార్టీలో ప్రతి మహిళా సబలే 
లోక్‌సభలో అధిర్‌ వ్యాఖ్యలకు దీటుగా బదులిచ్చిన నిర్మలా సీతారామన్‌

దిల్లీ: లోక్‌సభలో కాంగ్రెస్‌ సభాపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి వ్యాఖ్యలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ దీటుగా తిప్పికొట్టారు. తమ పార్టీలో ప్రతి ఒక్క మహిళా సబలేనన్నారు.  నిర్మలా సీతారామన్‌ను ‘నిర్బల’సీతారామన్‌గా పేర్కొంటూ అధిర్‌ చేసిన వ్యాఖ్యలకు బదులిస్తూ.. ‘‘నేను నిర్బల (బలహీనం) కాదు. మా పార్టీలో ప్రతి మహిళా సబలే (దృఢమైనవారే). నేను నిర్మల. నిర్మలగానే ఉంటా. మోదీ ప్రభుత్వంలో మహిళలంతా సబలలే. భాజపాలో పంచాయతీ స్థాయి నుంచి జాతీయ ఎగ్జిక్యూటివ్‌ స్థాయి వరకు ప్రతి మహిళా సబలే’’ అని తెలిపారు.  

మరోవైపు, లోక్‌సభలో పన్నుల సవరణ బిల్లు - 2019కు ఆమోదం లభించింది. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా నిర్మలా సీతారామన్‌ మాట్లాడారు. ‘‘నన్ను కొందరు చెత్త ఆర్థికమంత్రి అంటున్నారు. నా పదవీ కాలం పూర్తయ్యేంత వరకు కూడా వారు ఆగలేకపోతున్నారు. అలాంటి వాళ్లకు చెబుతున్నా.. నాకు ఆలోచనలు ఐడియాలు ఇవ్వండి. వాటిపై పనిచేద్దాం. వినే ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే అది నరేంద్ర మోదీ ప్రభుత్వమే.  కార్పొరేట్‌ ట్యాక్స్‌ మినహాయింపు చిన్న, పెద్ద వ్యాపారాలకూ మేలు చేస్తోంది’’ అని చెప్పారు.  

విమర్శల్ని వింటాం.. స్పందిస్తాం
తమ ప్రభుత్వం విమర్శలను సైతం వినేందుకు సిద్ధంగా ఉందని.. వాటిపై స్పందించేందుకు ప్రయత్నిస్తోందని నిర్మలా సీతారామన్‌ అన్నారు. ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో ఎకనమిక్‌ టైమ్స్‌ నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త రాహుల్‌ బజాజ్‌ పలు కఠినమైన ప్రశ్నలకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఆర్థిక మందగమనంపై లోక్‌సభలో చర్చ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాహుల్‌ బజాజ్‌కు అమిత్‌ షా చెప్పిన సమాధానాన్ని వెల్లడించారు. రాహుల్‌ బజాజ్‌ ప్రశ్నలు అడిగినప్పుడు తానూ వేదికపైనే ఉన్నానన్నారు. విమర్శల్ని వినాలి.. వాటిపై స్పందించాలన్న దృక్పథంతో తమ ప్రభుత్వం ఉందని అమిత్‌ షా చెప్పారని వివరించారు. 

ప్రధాని నరేంద్ర మోదీని, ఆయన పాలనను వ్యతిరేకిస్తూ బహిరంగంగా మాట్లాడాలంటేనే ప్రజలు భయపడుతున్నారని అమిత్‌ షాతో రాహుల్‌ బజాజ్‌ అన్నారు. ‘‘మీ ప్రభుత్వం బాగానే పనిచేస్తోంది. కానీ ఎవరైనా విమర్శలు చేస్తే మీరు ప్రశంసిస్తారన్న విశ్వాసం ఉండటంలేదు. ఇలాంటి ఆందోళనకరమైన పరిస్థితి ఉంది. తమ మదిలో ఉన్న మాటను ఎవరూ బయటపెట్టలేకపోతున్నారు. యూపీఏ -2 ప్రభుత్వంలో ప్రతిఒక్కరూ విమర్శలు చేసేవారు’’ అని రాహుల్‌ బజాజ్‌ తెలిపారు. దీనికి అమిత్‌ షా స్పందిస్తూ.. ‘‘దేనికీ భయపడాల్సిన అవసరం లేదు. మోదీ ప్రభుత్వంపై నిరంతరం మీడియాలో విమర్శలు వస్తున్నాయి. కానీ.. మీరు చెబుతున్నట్టు అలాంటి పరిస్థితే ఉంటే దాన్ని మనం సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది’’ అని షా చెప్పారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.