ఫేస్‌బుక్‌లో కొత్తగా ‘షార్ట్‌’ వీడియోస్‌
close

తాజా వార్తలు

Updated : 24/08/2020 20:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫేస్‌బుక్‌లో కొత్తగా ‘షార్ట్‌’ వీడియోస్‌

దిల్లీ: టిక్‌ టాక్‌ మీద మన దేశంలో నిషేధం విధించాక... చాలా సంస్థలు షార్ట్‌ వీడియో యాప్‌లు రూపొందించడం, లేదంటే వాళ్ల యాప్‌లో షార్ట్‌ వీడియోలు తీసుకురావడం లాంటివి చేస్తున్నాయి. తాజాగా ఫేస్‌బుక్‌ కూడా అదే దారిలోకి వచ్చింది. అయితే కొత్త యాప్‌ను తీసుకురాకుండా... ఉన్న యాప్‌లోనే షార్ట్‌ వీడియో అనే ఫీచర్‌ తీసుకొస్తోంది. ఇప్పటికే కొంతమందికి ఈ ఫీచర్‌ ప్రయోగాత్మకంగా అందుబాటులో ఉంది. న్యూస్‌ఫీడ్‌ మధ్యలో బ్లాక్స్‌లా షార్ట్ వీడియోస్‌ కనిపిస్తాయి. దీని ద్వారా యూజర్స్‌ తక్కువ నిడివి ఉన్న వీడియోలను రూపొందించవచ్చు. వీక్షించొచ్చు కూడా. వాట్సాప్‌ స్టేటస్‌, ఫేస్‌బుక్‌ స్టోరీ తరహాలో మన వీడియోకి వచ్చిన వ్యూస్‌ ఎన్ని అనేది కూడా తెలుసుకోవచ్చు. నిజానికిది ఫేస్‌బుక్‌కు కొత్తేం కాదు... ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ అని ఓ ఆప్షన్‌ ఉంది. దానినే పేరు మార్చి ఇక్కడకు తీసుకొచ్చారు. 

ఇప్పటికే భారత్ మార్కెట్లో రోపోసో, మోజ్, జోష్, ఎంఎక్స్‌ టకాటక్, చింగారీ, ట్రెల్లో, మిత్రోన్‌, రీల్స్‌, హాట్‌షాట్స్ వంటి షార్ట్‌ వీడియోల యాప్‌ల డౌన్‌లోడ్‌లు పెరిగాయి. దీనికి తోడు యూట్యూబ్ కూడా షార్ట్‌ పేరుతో వీడియో ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. మరికొన్ని సంస్థలు ఇలాంటి యాప్స్‌ తీసుకురావాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్‌ ఇలాంటి షార్ట్‌ వీడియోలు తీసుకురావడం గమనార్హం. మరోవైపు టిక్‌టాక్‌ను అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, భారత్‌లో సొంతం చేసుకునేందుకు మైక్రోసాఫ్ట్‌ ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు టిక్‌టాక్‌ మాతృ సంస్థ బైట్ ‌డ్యాన్స్‌తో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. జియో కూడా మన దేశంలో టిక్‌టాక్‌కు సంబంధించి పెట్టుబడులు పెట్టేందుకు చర్చలు జరిపినట్లు సమాచారం. తాజా డేటా ప్రకారం రోపోసో 70 మిలియన్‌, మోజ్ 50 మిలియన్, టకాటక్ 33 మిలియన్, మిత్రోన్ 23 మిలియన్ మంది డౌన్‌లోడ్ చేసుకున్నట్లు సమాచారం. ఇక అతి తక్కువ సమయంలోనే జోష్‌ యాప్‌ను 28 మిలియన్ డౌన్‌లోడ్‌ల, ట్రెల్, చింగారి యాప్‌లను 20 మిలియన్ల మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారట. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని