
తాజా వార్తలు
‘మై జీహెచ్ఎంసీ’ యాప్‌లో ఓటరు స్లిప్‌ల జారీ
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు పెద్ద ఎత్తున చైతన్య కార్యక్రమాలను చేపడుతున్నట్లు జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి లోకేశ్ కుమార్ తెలిపారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలోని స్వయం సహాయక బృందాల మహిళల ద్వారా ప్రత్యేక ఓటరు చైతన్య కార్యక్రమాలను చేపట్టినట్లు చెప్పారు. సర్కిళ్ల స్థాయిలో రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లతో సమావేశాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అలాగే గ్రేటర్ పరిధిలోని ఓటర్లందరికీ ఓటరు స్లిప్‌లను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ‘మై జీహెచ్ఎంసీ’ యాప్ ద్వారా ఓటరు స్లిప్‌లు డౌన్లోడ్ చేసుకోవచ్చని స్పష్టం చేశారు. యాప్‌లో ‘డౌన్లోడ్ యువర్ ఓటర్ స్లిప్’ ఆప్షన్ క్లిక్ చేసి పేరు, వార్డు నంబర్ నమోదు చేయడం ద్వారా ఓటరు స్లిప్, పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందనే విషయాన్ని గూగుల్ మ్యాప్ ద్వారా చూపిస్తుందన్నారు.
Tags :
జిల్లా వార్తలు