close

తాజా వార్తలు

Published : 17/03/2020 14:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘కరోనావైరస్‌’ బోనస్‌గా రెండువారాల జీతం.. 

వాషింగ్టన్‌: అమెరికాలోని ఒక కంపెనీ తన ఉద్యోగులకు రెండువారాల వేతనాన్ని కరోనావైరస్‌ను ఎదుర్కోవడానికి బోనస్‌గా అందజేసింది. వర్క్‌డే ఫైనాన్షియల్‌ కంపెనీ ఈ నిర్ణయం తీసుకొంది. కరోనావైరస్‌ కారణంగా పెరిగిన ధరలు, ఇతర ఇబ్బందులను ఎదుర్కోవడానికి ఈ బోనస్‌ను అందజేస్తోంది. ‘‘కరోనావైరస్‌ వ్యాప్తిచెందడంతో పలు సేవలను మూసివేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మా ఉద్యోగులకు ఆర్థిక ఊతం చాలా అవసరం. మా ఉద్యోగులను బాగా చూసుకొంటే.. మా వినియోగదారులను కూడా బాగా చూసుకొన్నట్లే. అనుకోని ఈ విపత్తు సమయంలో మా ఉద్యోగులకు అండగా నిలవడం చాలా కీలకం’’ అని ఒక ప్రకటనలో పేర్కొంది. 

బోనస్‌ కోసం ప్రత్యేకంగా ఒక అదనపు నిధిని కంపెనీ ఏర్పాటు చేసింది. దీంతోపాటు వేతనంతో కూడిన అనారోగ్య సెలవు విధానాన్ని కూడా సవరించి కొవిడ్‌-19కు కూడా వర్తింపజేసింది. 2005లో వర్క్‌డే సంస్థను ప్రారంభించారు. ఇది ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ సేవలు, హ్యూమన్‌ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌ సేవలు,  ప్లానింగ్‌ అండ్‌ అనలటిక్స్‌ అప్లికేషన్స్ వ్యాపారాలను నిర్వహిస్తుంది. అమెరికాలో దాదాపు 4,500 మందికిపైగా కరోనావైరస్‌ సోకగా.. వారిలో 88 మంది మరణించారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని