close

తాజా వార్తలు

Updated : 18/02/2020 16:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పురపాలికల్లో అవినీతి మచ్చ పోవాలి:కేసీఆర్‌

పక్కా ప్రణాళికతో ముందుకెళ్దాం

పట్టణ ప్రగతిపై సీఎం దిశానిర్దేశం

హైదరాబాద్‌: ప్రగతిభవన్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పురపాలక సదస్సు ముగిసింది. పట్టణ ప్రగతి నిర్వహణకు సంబంధించిన విధివిధానాలతో పాటు కార్యాచరణను సీఎం కేసీఆర్‌ ఖరారు చేశారు. ఈ మేరకు ప్రజాప్రతినిధులు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. 10 రోజుల పట్టణ ప్రగతిలో ఏం చేయాలనే విషయమై అవగాహన కల్పించారు. మున్సిపాల్టీల్లో అన్ని హంగులు ఉన్నాయా.. లేదా? నర్సరీలు ఇంకా ఎన్ని అవసరం? చెత్తసేకరణకు ఎన్ని వాహనాలు ఉన్నాయి? ఇంకా ఎన్ని కావాలి? ఇళ్లల్లో తడి, పొడి చెత్తబుట్టలు ఉన్నాయా.. లేదా? తదితర అంశాలతో పాటు పట్టణ ప్రగతికి సంబంధించి పూర్తిస్థాయి ప్రణాళికను రూపొందించారు. వాస్తవ పరిస్థితులకనుగుణంగా వెళ్లాలి తప్ప అతిగా ఊహించుకోవద్దని సూచించారు. పక్కా ప్రణాళిక రూపొందించి అవగాహనతో పట్టణాలను అభివృద్ధి చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. 

నగరాలను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలి

‘మున్సిపాలిటీ అంటే మురికి, చెత్తకు పర్యాయపదంగా మారింది. అవినీతికి మారు పేరైంది. ఈ చెడ్డ పేరు పోవాలంటే పారదర్శక విధానాలు అవలంబించాల్సిన అవసరం ఉంది’ అని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. పూర్తిస్థాయిలో అవినీతి నిరోధక వ్యవస్థ ఉండాలనీ.. పట్టణ ప్రగతి ప్రణాళికాబద్ధంగా జరగాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. తెలంగాణలోని అన్ని పట్టణాలు, నగరాలను దేశంలోకెల్లా ఆదర్శంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఆదర్శంగా మార్చే బాధ్యత మేయర్లు, ఛైర్‌పర్సన్లు, కార్పొరేటర్లపైనే ఉందన్నారు. రాజకీయ నాయకుల ప్రవర్తన ఎలా ఉండాలో సీఎం వివరించారు. 

ప్రతివార్డుకు శాశ్వతంగా ప్రత్యేక అధికారిని నియమించండి

పౌర సదుపాయాలు పూర్తిస్థాయిలో కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం, స్థానిక పురపాలక సంస్థలపైనే ఉందన్న సీఎం కేసీఆర్‌.. వార్డుల వారీగా ప్రణాళిక రూపొందించుకొని స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, అదనపు కలెక్టర్లు, కలెక్టర్లు, ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ప్రతివార్డుకు ఒక శాశ్వత ప్రాతిపదికన ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు. వార్డుకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని సేకరించి.. అన్ని విషయాలనూ సేకరించాలనీ.. అందుకనుగుణంగా ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకొనే పరిస్థితులు కల్పించాలన్నారు. పచ్చదనం- పరిశుభ్రత అంశంపైనా దృష్టిపెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్లు, ఛైర్‌పర్సన్లు, కమిషనర్లు పాల్గొన్నారు. 

గజ్వేల్‌కు మంత్రులు, అధికారుల బృందం పయనం

సీఎం కేసీఆర్‌ సమావేశం అనంతరం మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల బృందం గజ్వేల్‌కు బయల్దేరింది. ఉమ్మడి జిల్లాల వారీగా ప్రత్యేక బస్సుల్లో పయనమయ్యారు. గజ్వేల్‌లో మార్కెట్లు, శ్మశానవాటికలను ఈ బృందం పరిశీలించనుంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.