close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 17/05/2020 17:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇంటికెళుతూ స్నేహితుడి ఒడిలో..

లాక్‌డౌన్‌ వేళ మరో హృదయవిదారక ఘటన

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశంలో ఒకవైపు కరోనా వైరస్‌ కేసులు విజృంభిస్తుంటే, మరోవైపు వలసకూలీల కన్నీటిగాధలు వినిపిస్తున్నాయి. మహమ్మారిని అడ్డుకునే క్రమంలో విధించిన లాక్‌డౌన్‌ ఎంతో మంది వలస జీవులకు ప్రాణ సంకటంగా మారింది. లాక్‌డౌన్‌ విధించి రెండు నెలలు కావస్తున్నా ఇంకా వేలాది మంది వలస కార్మికులు కాలినడకనే స్వస్థలాలకు పయనమవుతున్నారు. ఈ క్రమంలో కొందరు ఇళ్లకు చేరుకుంటుండగా మరికొందరు అనంతలోకాలకు చేరుతున్నారు. కొంతమంది రహదార్ల ప్రమాదాల్లో మరణిస్తుండగా, మరికొందరు ఇతర కారణాలతో కన్నుమూస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఓ ఘటన మరో కన్నీటికథగా మిగిలిపోయింది.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బస్తీకి చెందిన అమ్రిత్‌ అనే 24 ఏళ్ల యువకుడు సూరత్‌లోని ఓ వస్త్ర వ్యాపార సంస్థలో పనిచేస్తున్నాడు. లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన అతను ఇటీవల స్వగ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆంక్షలు సడలించడంతో లారీలో ఇంటికెళ్లేందుకు సిద్ధమైన అతడు, ఓ లారీ డ్రైవర్‌కు రూ.4000 చెల్లించి ప్రయాణం సాగించాడు. మార్గమధ్యలో తీవ్ర అస్వస్థతకు గురైన అమ్రిత్‌ మధ్యప్రదేశ్‌లోని శివ్‌పురీ జిల్లాలో లారీ దిగిపోయాడు. అతని వెంట స్నేహితుడు యాకుబ్‌ ఒక్కడే ఉన్నాడు. లారీ దిగిన తర్వాత అమ్రిత్‌ స్పృహ కోల్పోయి యాకుబ్‌ ఒడిలో అచేతనంగా పడిపోయాడు. దిక్కుతోచని స్థితిలో, యాకుబ్‌ తన స్నేహితుడిని కాపాడాలని రహదారి వెంట వెళ్లేవారిని సాయం అడిగాడు. ఎవరూ స్పందించకపోవడంతో అమ్రిత్‌ కన్నుమూశాడు. ఒకతను ఈ ఘటనకు సంబంధించిన ఫొటోల్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకోడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

‘అమ్రిత్‌కు తీవ్ర జ్వరం రావడంతో పాటు అప్పటికే వాంతులు కూడా చేసుకున్నాడు. ఈ లక్షణాలు ఎండ తీవ్రతకు సంబంధించినవిగా కనిపించాయి. అతని మృతదేహానికి కరోనా పరీక్షలు జరిపాము. వాటి ఫలితాలు వచ్చాకే అసలు విషయం తెలుస్తుంది. యాకుబ్‌ను జిల్లా క్వారంటైన్‌ కేంద్రానికి తరలించాం. అతనికి కరోనా పరీక్షలు నిర్వహించాం, ఫలితాలు రావాల్సి ఉంది’ అని జిల్లా వైద్యాధికారి తెలిపారు. వలస కూలీలు స్వస్థలాలకు చేరేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల శ్రామిక్‌ రైళ్లు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అలాగే పలు రాష్ట్రాలు కూడా బస్సు సర్వీసులను నడుపుతున్నాయి. అయినా, కొందరు కార్మికులు ఎండలోనే నడుచుకుంటూ స్వగ్రామాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.