రూ.లక్షసంచితో కోతి పరార్‌..వృద్ధుడి తిప్పలు
close

తాజా వార్తలు

Published : 24/12/2020 00:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రూ.లక్షసంచితో కోతి పరార్‌..వృద్ధుడి తిప్పలు

లఖ్‌నవూ: కోతి చేష్టలు ఎలా ఉంటాయో తెలిసిందే! ఇళ్లలోకి వెళ్లి వస్తువులు ఎత్తుకెళ్లడం, మనుషుల దగ్గర తినే పదార్థాలుంటే ఎగబడటం వంటివి తరచూ జరుగుతూనే ఉంటాయి. ఇవి కొన్నిసార్లు నవ్వు తెప్పించినా.. అప్పుడప్పుడు ప్రాణాల మీదకూ తెస్తాయి. తాజాగా.. అలాంటి వింత ఘటన ఉత్తర్‌ ప్రదేశ్‌లోని సీతాపూర్‌ జిల్లా వికాస్‌ భవన్‌లోని రిజిస్టర్‌ కార్యాలయంలో చోటు చేసుకుంది.

ఖైరాబాద్‌కు చెందిన ఓ వృద్ధుడు తన కుమారుడి వైద్యం కోసం భూమిని విక్రయించాడు. కొనుగోలుదారుడు ఇచ్చిన లక్ష రూపాయలను తన నీలం రంగు సంచీలో పెట్టుకున్నాడు. ఇంతలో ఓ తుంటరి వానరం హఠాత్తుగా కిందికి దూకి ఆ వృద్ధుడి చేతిలోని సంచి లాక్కొని చెట్టెక్కింది. దాంతో సదరు వ్యక్తికి ప్రాణం పోయినంత పనైంది. వెంటనే కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్నవారు దాన్ని పట్టుకొనేందుకు ప్రయత్నించారు.

చెట్టుపై కొమ్మపైకి ఎక్కిన కోతి కేకలు విని సంచిలో ఉన్న డబ్బులు గాల్లోకి విసేరిసింది. దీంతో అక్కడున్న జనం వాటిని ఏరుకునేందుకు ఎగబడ్డారు. కాగా, కొందరు తమకు దొరికిన నోట్లను ఆ వృద్ధుడికి తిరిగిచ్చేసి నిజాయితీ చాటుకున్నారు. చివరకు ఆ సంచీనీ వదిలేసి వెళ్లిందా కోతి. ఈ ఘటనలో సుమారు రూ.7 వేలు నష్టపోయానని ఆ బాధితుడు విలపించాడు.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని