close

తాజా వార్తలు

టాప్ 10 న్యూస్‌ @ 9 PM

1. ప్రజాభిప్రాయం కోసమే సెలెక్ట్‌ కమిటీకి:యనమల

సీఎం జగన్‌కు సలహాలు ఇవ్వడానికి ఎవరికీ ధైర్యం లేదని మండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. మంగళగిరి తెదేపా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మండలి జరుగుతుంటే మామూలుగా ఇద్దరు మంత్రులు కూడా రారని.. అలాంటిది మండలికి 22 మంది మంత్రులు రావాల్సిన అవసరం ఏముందని యనమల ప్రశ్నించారు.  ప్రజల అభిప్రాయం తీసుకోవడానికే బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపిస్తారని.. అక్కడ దాదాపు మూడు నెలల సమయం పడుతుందని యనమల వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. మండలి పరిణామాలు బాధించాయి:జగన్‌

శాసన మండలిలో జరిగిన పరిణామాలు తనను ఎంతగానో బాధించాయని సీఎం జగన్‌ అన్నారు. మండలి చట్టసభలో భాగమైనందున చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా వ్యవహరిస్తుందని నమ్మాం అని చెప్పారు. కానీ తనతో పాటు ఐదు కోట్ల ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ మండలిలో జరిగిన తంతును అందరమూ చూశామన్నారు. మండలిలో బుధవారం జరిగిన పరిణామాలపై శాసనసభలో జరిగిన చర్చలో సీఎం మాట్లాడారు. ‘‘గ్యాలరీల్లో తెదేపా అధినేత చంద్రబాబు కూర్చొని జారీ చేసిన ఆదేశాలు చూస్తే మండలి ఛైర్మన్‌ నిష్పాక్షికంగా మండలి నిర్వహించే పరిస్థితి లేదని సభ చూసిన ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది’’ అని జగన్‌ వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. తెలంగాణ ఎంసెట్‌ షెడ్యూల్‌లో మార్పులు

ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌లో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి పలు మార్పులు చేసింది. ఎంసెట్‌, లాసెట్‌, పీజీ ఈసెట్‌, లాసెట్‌, పీజీ ఎల్‌సెట్‌ పరీక్షలకు సంబంధించి మారిన తేదీలను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. మే నెల 4, 5, 7, 8 తేదీల్లో ఇంజినీరింగ్‌ ఎంసెట్‌, మే 9, 11వ తేదీల్లో ఫార్మా ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి. మే 27న లాసెట్‌, పీజీ ఎల్‌సెట్‌, మే 28 నుంచి 31 వరకు పీటీ ఈసెట్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. మూడు చోట్ల రేపు రీపోలింగ్‌

తెలంగాణలో జరిగిన పురపాలక ఎన్నికల్లో టెండర్ ఓట్లు దాఖలైన మూడు చోట్ల రేపు రీపోలింగ్ జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. మహబూబ్‌నగర్, కామారెడ్డి, బోధన్ పురపాలికల పరిధిలోని ఒక్కో పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ నిర్వహించనున్నారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో టెండర్ ఓట్లు దాఖలు కావడంతో ఎస్ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. బీఎస్‌ఎన్‌ఎల్‌తో చేతులు కలిపిన యప్‌ టీవీ

గ్రామీణ ప్రాంతాల్లో ట్రిపుల్‌ ప్లే సేవలు అందించడం కోసం ప్రముఖ ఓటీటీ వేదిక యప్‌ టీవీ.. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌తో చేతులు కలిపింది. త్వరలోనే దక్షిణ భారత గ్రామాల్లో ఈ సేవలు ప్రారంభించనుంది. తొలుత తెలంగాణలోని కరీంనగర్‌ జిల్లా వీణవంక గ్రామానికి ఈ సేవలను తీసుకొస్తోంది. ఈ ఏడాదిలోగా దేశవ్యాప్తంగా సేవలను విస్తరించాలని భావిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. జగన్‌ రైతు పక్షపాతి ఎలా అవుతారు: రామకృష్ణ

రాజధాని రైతులకు వ్యతిరేకంగా హైకోర్టులో వాదించటానికి న్యాయవాదికి రూ.5 కోట్లు ఖర్చు చేసే ముఖ్యమంత్రి  రైతు పక్షపాతి ఎలా అవుతారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రశ్నించారు. పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లులను సవాల్‌ చేస్తూ రాజధాని ప్రాంత రైతులు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీటిపై ఎలాగైనా గెలుపొందాలని నిర్ణయించుకున్న ప్రభుత్వం... సీనియర్‌ న్యాయవాది, మాజీ అటార్నీ జనరల్ ముకుల్‌ రోహత్గీని న్యాయవాదిగా ఏర్పాటు చేస్తూ హడావుడిగా జీవో విడుదల చేయడాన్ని రామకృష్ణ తప్పుబట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. ఒవైసీవి రెచ్చగొట్టే మాటలు: భాజపా

పార్టీ కార్యక్రమాలకు పోలీసులు అనుమతులు ఇవ్వడం లేదని నగర పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌కు భాజపా నేతలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, ఎమ్మెల్సీ రామచందర్‌రావు సీపీకి ఫిర్యాదు చేశారు.అనంతరం వారు మీడియాతో  మాట్లాడుతూ... ఎంఐఎం చేసే కార్యక్రమాలకు పోలీసులు ఎలా అనుమతిస్తున్నారని ప్రశ్నించారు. ఉద్దేశ పూర్వకంగానే మజ్లిస్‌ అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. ఉత్తమ ఎన్నికల అధికారిగా గోపాలకృష్ణ ద్వివేది

2019 సార్వత్రిక ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించినందుకు గాను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ‘ఉత్తమ ఎన్నికల నిర్వహణ’అవార్డుకు ఎంపికైంది. ఉత్తమ ఎన్నికల అధికారిగా మాజీ సీఈఓ గోపాలకృష్ణ ద్వివేది నిలిచారు. అత్యుత్తమ ఎన్నికల నిర్వహణ విభాగంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ అవార్డు ప్రకటించింది. ఈ నెల 26వ తేదీన దిల్లీలో జరిగే కార్యక్రమంలో గోపాలకృష్ణ ద్వివేదిని అవార్డుతో సత్కరించనున్నారు. అంతేకాకుండా రూ.లక్ష నగదు బహుమతిని అందిస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. ఫోన్‌పేలో అదిరిపోయే ఫీచర్‌

ఆన్‌లైన్‌ లావాదేవీల సంస్థ ‘ఫోన్‌పే’ తన వినియోగదారులకు మరో మంచి సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చింది. బ్యాంకు ఖాతాలో డబ్బున్నా.. నగదు అవసరమైనప్పుడు దగ్గర్లో ఏటీఎం లేకపోతే ఇబ్బందులు పడుతుంటాం. ఇక ఇలాంటి ఇబ్బందుల నుంచి కొంత ఉపశమనం దక్కనుంది. ఇప్పటి వరకూ చెల్లింపుల సదుపాయం మాత్రమే కల్పించిన ఈ యాప్‌ నగదు ఉపసంహరణకు ‘ఫోన్‌పే ఏటీఎం’ను ప్రవేశపెట్టింది. ఫోన్‌పే వినియోగదారులు ఈ యాప్‌ సదుపాయం ఉన్న దుకాణాదారుల వద్ద దీని ద్వారా నగదు ఉపసంహరించుకోవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10.యువతే దేశ భవిష్యత్తు:తమిళిసై

 



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.