అందరూ ఉన్నా... ఆ నలుగురేరన్నా!
close

తాజా వార్తలు

Updated : 12/07/2020 09:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అందరూ ఉన్నా... ఆ నలుగురేరన్నా!

ఉంగుటూరు, న్యూస్‌టుడే: సుమారు 1,500 మంది గ్రామస్థులు, బంధువులూ, స్నేహితులూ ఎక్కువే. కానీ ఆయన కడ చూపునకు ఎవరూ రాలేదు. అంత్యక్రియలు చేసేందుకు ఆ నలుగురూ లేకుండా పోయారు. కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం నాగవరపాడుకు చెందిన వ్యక్తి (55) కిరాణా దుకాణం నడుపుతున్నారు. ఆయనకు మధుమేహం, అల్సర్‌ ఉన్నాయి. ఇటీవల జ్వరం రావడంతో విజయవాడ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. శుక్రవారం ఇంటికి వచ్చారు. శనివారం మరణించారు. ఆయనకు భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఖననం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. కొందరు పెద్దలు జేసీబీ మాట్లాడినా... వచ్చేందుకు డ్రైవర్‌ నిరాకరించారు. మృతుని సోదరుడు, మరో సోదరుని ఇద్దరు పిల్లలు... ఉంగుటూరు నుంచి మనుషుల్ని తీసుకొచ్చి గుంత తవ్వించారు. ఆ తర్వాత ముగ్గురూ కలిసి ఆటోలో మృతదేహాన్ని తీసుకువెళ్లి అంత్యక్రియలు చేశారు. కరోనాకు భయపడి... ఆయనను అనాథ శవంలా పంపాల్సి వచ్చిందని గ్రామస్థులు వాపోయారు. మృతుని నుంచి నమూనాలు సేకరించామని, 2 రోజుల్లో ఫలితాలు వస్తాయని అధికారులు చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని