close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 119051732 [video_srlno] => 1 [video_type] => 3 [video_link] => 1200368536402575360 [video_short_link] => 1200368536402575360 [created_by] => [created_date] => [modified_by] => 8924876 [modified_date] => 2019-12-02 23:29:49.416896 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

పాక్‌ ఖాతాలో చెత్త రికార్డు

అడిలైడ్‌: ఆస్ట్రేలియాతో జరిగిన డే/నైట్‌ టెస్టులో పాకిస్థాన్‌ ఇన్నింగ్స్ 48 పరుగుల తేడాతో ఘోరపరాజయాన్ని చవిచూసింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌ను 0-2తో కోల్పోయింది. రెండో టెస్టులో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ మూడు వికెట్ల నష్టానికి 589 పరుగులు చేసింది. వార్నర్‌ త్రిశతకంతో చెలరేగాడు. అనంతరం బ్యాటింగ్‌ చేపట్టిన పాక్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 302 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆసీస్‌ పాక్‌ను ఫాలోఆన్‌ ఆడించింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆసీస్‌ బౌలర్ల ధాటికి పాక్‌ నిలవలేక 239 పరుగులకే ఆలౌటైంది. ఈ ఓటమితో పాక్‌ చెత్త రికార్డును నమోదుచేసుకుంది. ఆస్ట్రేలియాలో వరుసగా అత్యధిక ఓటములను చవిచూసిన జట్టుగా పేలవమైన రికార్డు సృష్టించింది. 14 టెస్టుల్లో వరుసగా ఓటమిపాలైంది. 1999 నుంచి ఇప్పటివరకు పాక్‌ ఆసీస్ గడ్డపై కనీసం ఒక్క మ్యాచ్‌ను కూడా పాక్‌ డ్రా చేసుకోలేకపోయింది. 1995లో ఆఖరిగా విజయం సాధించింది.

పాక్‌ ఫీల్డింగ్‌పై ఆ దేశ మాజీ ఆటగాడు వసీమ్‌ అక్రమ్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. నిద్రమత్తులో ఫీల్డింగ్‌ చేస్తున్నారా అని అతడు మండిపడ్డాడు. ఆసీస్‌ మాజీ సారథి రికీ పాంటింగ్ సైతం పాక్ ఆటతీరు అధ్వానంగా ఉందని పేర్కొన్నాడు. ఆసీస్‌ పర్యటనలో భాగంగా పాక్‌ తలపడిన మూడు టీ20ల సిరీస్‌ను 0-2 తేడాతో, రెండు టెస్టుల సిరీస్‌ను 0-2 తేడాతో ఓడింది.

 

 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.