close
Array ( ) 1

తాజా వార్తలు

మరణాల రేటు భారీగా పెరగనుంది: ట్రంప్‌

 వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతున్న వేళ అధ్యక్షుడు ట్రంప్‌ ఆదివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరో రెండు వారాల్లో మరణాల రేటు భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో మహమ్మారి కట్టడికి కోసం చేపట్టిన ఆంక్షల్ని ఏప్రిల్‌ 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలంతా ప్రభుత్వ నిబంధనల ప్రకారం అప్పటి వరకు సామాజిక దూరం పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. శ్వేతసౌధంలో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరికొన్ని వారాల్లో దేశంలో పరిస్థితులు యథాతథ స్థితికి చేరుకుంటాయని ఇటీవల ఓ సందర్భంలో అభిప్రాయపడ్డ ట్రంప్‌.. ఇప్పుడు ఆ మాటల నుంచి వెనక్కితగ్గడం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. ఈస్టర్‌ పర్వదినం నాటికి అంతా సర్దుకోవాలని తాను ఆశించానన్నారు. కానీ, పరిస్థితులు ఆ దిశగా సాగడం లేదని నిరాశ వ్యక్తం చేశారు.

కరోనా వైరస్‌ వ్యాప్తి అమెరికాలో అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో 15 రోజుల పాటు జనసంచారంపై ఆంక్షలు విధించారు. ఆ కాలం నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో వాటిని మరో నెలరోజుల పాటు కొనసాగించనున్నట్లు ప్రకటించారు. అమెరికాలో లక్ష మందికిపైగా ప్రాణాలను కరోనా బలి తీసుకునే ముప్పుందని ఆ దేశ ఆరోగ్య శాఖ నిపుణుడు ఆంథోనీ ఫాసీ అంచనా వేశారు. ఈ వైరస్‌ బెడద ఇప్పుడిప్పుడే తొలగిపోయేలా కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కొవిడ్‌ దెబ్బకు మృత్యువాతపడే వారి సంఖ్య లక్ష నుంచి 2 లక్షల మధ్య ఉంటుందనిపిస్తోందని అన్నారు. ఈ నేపథ్యంలో మరికొన్ని రోజుల పాటు ఆంక్షల్ని కొనసాగించాలని ట్రంప్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

అమెరికాలో ఇప్పటి వరకు 1,42,226 మందికి కరోనా వైరస్‌ సోకింది. వీరిలో 2,493 మంది మరణించారు. మరో 4,443 మంది కోలుకున్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.