
తాజా వార్తలు
పోలింగ్ సామగ్రి పంపిణీ షురూ
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. సిబ్బందికి అధికారులు పోలింగ్ సామగ్రిని అందిస్తున్నారు. దీని కోసం జీహెచ్ఎంసీ పరిధిలో 30 డీఆర్సీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచే బ్యాలెట్ బాక్సులు, స్ట్రాంగ్ రూములు, లెక్కింపు కేంద్రాల నిర్వహణ చేపట్టనున్నారు. ఖైరతాబాద్, సికింద్రాబాద్, కూకట్పల్లి జోన్లలో ఐదేసి డీఆర్సీ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. శేరిలింగంపల్లి జోన్లో నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ అధికారులు, సహాయ పోలింగ్ అధికారులు డీఆర్సీ కేంద్రాలకు వచ్చి సామగ్రిని తీసుకుంటున్నారు. పోలింగ్ సామగ్రితోపాటు కరోనా కిట్లు, శానిటైజర్లను పంపిణీ చేస్తున్నారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.
Tags :
రాజకీయం
జిల్లా వార్తలు