
తాజా వార్తలు
‘RRR’: కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ వచ్చేశాడు!
హైదరాబాద్: ఎన్టీఆర్ అభిమానులు ఎంతోకాలం నుంచి ఎదురు చూస్తున్న ఆ సమయం రానే వచ్చింది. ‘ఆర్ఆర్ఆర్’లో తమ అభిమాన కథానాయకుడు ఫస్ట్‌లుక్, టీజర్ కోసం ఆశగా చూస్తున్న వారికి చిత్ర బృందం అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. లేటుగా వచ్చినా లేటెస్ట్గా కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ పాత్రను రామ్‌చరణ్ ప్రేక్షకులకు పరిచయం చేశారు. రామ్‌చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఆలియాభట్, ఓలివియా మోరిస్ కథానాయికలు.
‘‘వాడు కనబడితే సముద్రాలు తడబడతాయి. నిలబడితే సామ్రాజ్యాలు సాగిలపడతాయి. వాడి పొగరు ఎగిరే జెండా.. వాడి ధైర్యం చీకట్లను చీల్చే మండుటెండ.. వాడు భూతల్లి చనుబాలు తాగిన మన్యం ముద్దు బిడ్డ. నా తమ్ముడు గోండు బెబ్బులి. కొమురం భీమ్’’ అంటూ తారక్ పాత్రను రామ్‌చరణ్ పరిచయం చేశారు. కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ లుక్ అభిమానులను కట్టిపడేసింది. ఇక తెరపై ఎన్టీఆర్ నట విశ్వరూపం చూడటమే ఆలస్యం.
కరోనా కారణంగా ఆగిపోయిన ఈ చిత్ర షూటింగ్ ఇటీవల ప్రారంభం కాగా, షూటింగ్ మొదలైన వెంటనే ఎన్టీఆర్‌కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించి, ప్రత్యేక వీడియోను విడుదల చేస్తామని దర్శకుడు రాజమౌళి ప్రకటించారు. గురువారం తాజా వీడియోను రామ్‌చరణ్ అభిమానులతో పంచుకున్నారు. ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని తొలుత చెప్పినా, అభిమానులను కాస్త ఊరించి 11.30గం.లకు విడుదల చేశారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ట్రంప్ వీడ్కోలు: చాలా అందంగా ఉంది
- స్వాగతం అదిరేలా..
- రాధికా ఆంటీ.. నా సీక్రెట్స్ బయటపెట్టేస్తుంది..!
- ట్రంప్‌కు టిమ్ కుక్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..?
- సిడ్నీ టెస్టు కాగానే ద్రవిడ్ సందేశం పంపించారు
- మద్యం మత్తులో నగ్నంగా చిందేసిన యువతి
- ఎవరూ దొరక్కపోతే స్మిత్‌కే సారథ్యం!
- నల్గొండ జిల్లాలో ఘోరప్రమాదం: 9 మంది మృతి
- ఆర్సీబీ నిర్ణయంపై పార్థివ్ పటేల్ జోక్..
- అమ్మో.. టీమ్ఇండియాతో అంటే శ్రమించాల్సిందే
ఎక్కువ మంది చదివినవి (Most Read)
