ఈడీ విచారణకు రౌత్‌ భార్య మళ్లీ డుమ్మా!
close

తాజా వార్తలు

Updated : 29/12/2020 13:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈడీ విచారణకు రౌత్‌ భార్య మళ్లీ డుమ్మా!

ముంబయి: విచారణకు హాజరయ్యేందుకు తనకు మరికొంత సమయం ఇవ్వాలని శివసేన సీనియర్‌ నేత సంజయ్‌ రౌత్‌ భార్య వర్ష రౌత్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)ని కోరారు. ‘పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కో-ఆపరేటివ్‌(పీఎంసీ)’ బ్యాంక్‌ నగదు అక్రమ చలామణికి సంబంధించిన కేసులో విచారణ నిమిత్తం తమ ఎదుట హాజరుకావాలని ఈడీ ఆదివారం ఆమెను ఆదేశించింది. ఇంతకు ముందు కూడా ఆమెకు రెండుసార్లు సమన్లు జారీ చేయగా.. అనారోగ్య కారణాలు చెబుతూ విచారణకు గైర్హాజరయ్యారు. ఈసారి కూడా విచారణకు డుమ్మా కొట్టిన ఆమె.. సమయం కావాలని కోరారు.

ఈడీ సమన్లనుద్దేశించి కేంద్రంపై సంజయ్‌ రౌత్‌ సోమవారం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా రాజకీయ కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. కేంద్ర దర్యాప్తు సంస్థల్ని పావులుగా వాడుకొని మహారాష్ట్రలోని మహావికాస్‌ ఆఘాడీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్ర సంస్థల ఒత్తిడితో 22 మంది కాంగ్రెస్‌, ఎన్‌సీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయనున్నారన్నారు. ఆ జాబితా భాజపా నాయకుల వద్ద ఉందన్నారు. తమను నేరుగా ఎదుర్కోలేకే భాజపా ఈ రాజకీయ క్రీడకు తెరలేపిందని ఆరోపించారు.

ఇవీ చదవండి...

తిరువనంతపురం మేయర్‌ పీఠంపై ఆర్య రాజేంద్రన్‌

రైతుల కోసం దీక్షకు దిగుతా : అన్నా హజారేTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని