ఎక్కడైనా కరోనాకు చికిత్స ఒకటే:ఈటల
close

తాజా వార్తలు

Published : 06/09/2020 16:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎక్కడైనా కరోనాకు చికిత్స ఒకటే:ఈటల

హైదరాబాద్‌: కొవిడ్‌ సమయంలో పనిచేయడం అందరికీ గొప్ప జ్ఞాపకమని.. ప్రతి ఒక్కరికీ భరోసా కల్పించి ప్రాణాలు కాపాడాలని ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పిలుపునిచ్చారు. ప్రపంచంలో ఎక్కడైనా కరోనాకు చికిత్స ఒకటేనని.. అనవసరంగా కార్పొరేట్‌ ఆస్పత్రులకు వెళ్లి ఖర్చు చేసుకోవద్దని ప్రజలకు ఆయన సూచించారు. సుమారు 22వేల మంది ఆశావర్కర్లు, 500 మంది ఏఎన్‌ఎంలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈటల మాట్లాడారు. గ్రామాల్లో కరోనా సోకిన వ్యక్తులను మొదటిరోజే గుర్తించగలిగితే కొవిడ్‌ వ్యాప్తిని అరికట్టడంతోపాటు వారి ప్రాణాలను కాపాడగలుగుతామన్నారు. 

ప్రజల భాగస్వామ్యంతోనే ఇలాంటి వ్యాధులను ఎదుర్కోగలమని సీఎం కేసీఆర్‌ పదేపదే చెబుతుంటారని ఈటల గుర్తు చేశారు. ఇతర సీజనల్‌ వ్యాధులు, కరోనా ఒకటే లక్షణాలు కలిగి ఉన్నందున సాధ్యమైన త్వరగా పరీక్షలు చేసి నిర్ధారణ చేసుకోవాలని సూచించారు. ర్యాపిడ్‌ పరీక్షలో నెగెటివ్‌ వచ్చిన వారికి లక్షణాలు ఉంటే తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్‌ పరీక్ష చేయించాలని మంత్రి స్పష్టం చేశారు. ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంల వేతనాల పెంపుపై సీఎం కేసీఆర్‌తో చర్చిస్తామని ఈటల హామీ ఇచ్చారు. 
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని