
తాజా వార్తలు
హోంవర్కు చేయలేదని మూతి కాల్చిన వైనం
అగ్గిపుల్లతో చిన్నారికి వాత పెట్టిన ఉపాధ్యాయురాలు
మధ్యప్రదేశ్‌లో దారుణం
బర్వానీ: హోంవర్కు చేయలేదని ఓ ఉపాధ్యాయురాలు నాలుగేళ్ల చిన్నారి పెదాలను కాల్చిన ఘటన మధ్యప్రదేశ్‌లోని బర్వానీ ప్రాంతంలో జరిగింది. సెంధ్వా పోలీసు అధికారిణి భవానీరామ్వర్మ తెలిపిన వివరాల ప్రకారం.. కరోనా నేపథ్యంలో బడులు మూతబడి ఉండటంతో బాధిత చిన్నారి తల్లిదండ్రులు హేమా ఒమర్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయురాలి వద్దకు ట్యూషన్‌కు పంపుతున్నారు. నవంబరు 19న ఆ చిన్నారి ట్యూషన్ ముగించుకొని ఇంటికి చేరుకున్న తర్వాత తీవ్ర అస్వస్థతకు గురైంది. చిన్నారి పైపెదవిపై కాల్చిన గుర్తులుండటంతో వారు సంబంధిత ఉపాధ్యాయురాలిని ప్రశ్నించారు. ఆమె ఈ ఆరోపణలను ఖండించారు. క్రమశిక్షణగా ఉంచటం కోసం తాను చిన్నారిని దండించానే తప్ప కాల్చలేదని ఆమె తెలిపారు. తర్వాత బాలిక తండ్రి ఉపాధ్యాయురాలిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలికను కొట్టి, అగ్గిపుల్లతో కాల్చినట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు కరోనా సమయంలో తాను చిన్నారులకు ట్యూషన్ చెప్పడానికి నిరాకరించినా వారు బలవంతంగా పంపుతున్నారని ఉపాధ్యాయురాలు తెలిపింది. కరోనా కారణంగా మూతబడి ఉన్న బడులను నవంబరు తర్వాతే తెరుస్తామని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- భారత్ చిరస్మరణీయ విజయం..
- ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- భీమవరం మర్యాదా.. మజాకా..!
- బాయ్‌ఫ్రెండ్ ఫొటో పంచుకున్న కాజల్
- గుడివాడ రెండో పట్టణ ఎస్సై ఆత్మహత్య
- భారత్ vs ఆస్ట్రేలియా: కొత్త రికార్డులు
- ఆసీస్ పొగరుకు, గర్వానికి ఓటమిది
- కన్న కూతురిపై ఏడేళ్లుగా అత్యాచారం
- మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్టు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
