close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 02/06/2020 16:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రభుత్వం అనుమతి

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నందున గత రెండు నెలలకుపైగా తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించని విషయం తెలిసిందే. తాజాగా 6 అడుగుల భౌతిక దూరం పాటిస్తూ ఈ నెల 8 నుంచి దర్శనాలకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రయోగాత్మక దర్శనాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మే 12న తితిదే ఈవో రాసిన లేఖకు రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ దర్శనాలకు అనుమతి మంజూరు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఆ అంశాన్ని సీరియస్‌గా పరిగణించాలి

స్వస్థలాలకు వెళ్లాలనుకునే వలస కార్మికులు రైళ్లు, బస్సులు ఎక్కేవరకు వారికి భోజనం, వసతి కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఇటుక బట్టీల కార్మికులు, వలస కూలీలను స్వస్థలాలను తరలించాలని దాఖలైన వ్యాజ్యాలపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. కార్మిక శాఖ ఉప కమిషనర్లు ఇటుక బట్టీలు సందర్శించి వలస కూలీలను గుర్తించాలని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. శ్రీశైలం ఆలయ అవినీతి..రూ.2.12 కోట్లు స్వాహా

 శ్రీశైల మల్లన్న స్వామి ఆలయంలో అభిషేకం, ఆర్జిత సేవల విషయంలో చోటుచేసుకున్న కుంభకోణాన్ని పోలీసులు ఛేదించారు. ఈ అవినీతికి సంబంధించి 4 కేసుల్లో 27 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం రూ. 2.12 కోట్లు అవినీతి జరిగిందని డీఎస్పీ వెంకట్రావు తెలిపారు. ఇప్పటివరకు రూ.83.40 లక్షల నగదు, ఒక కారును రికవరీ చేసుకున్నట్లు డీఎస్పీ వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ‘భారత సరిహద్దుల్లో చైనా బలగాలు’

ఇటీవల చైనా తమ సైనిక బలగాలను భారత సరిహద్దుల్లోకి తరలించిందని అమెరికా ‘సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌’ మైక్‌ పాంపియో తెలిపారు. కేవలం నియంతృత్వ ప్రభుత్వాలే ఇలాంటి చర్యలకు పాల్పడతాయని వ్యాఖ్యానించారు. పరోక్షంగా ఈ అంశంలో భారత్‌కు మద్దతు పలికిన పాంపియో.. డ్రాగన్‌ దుశ్చర్యలను తప్పుబట్టారు. ఇటీవల తూర్పు లద్దాఖ్‌, ఉత్తర సిక్కిం ప్రాంతాల్లో వాస్తవాధీన రేఖ వెంట భారత్‌-చైనా సైనికులు తీవ్ర స్థాయిలో ఘర్షణకు దిగిన విషయం తెలిసిందే. దీంతో ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో కొన్ని రోజులు ఉద్రిక్తలు కొనసాగాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. 12మంది ఉస్మానియా వైద్యవిద్యార్థులకు కరోనా

ఉస్మానియా వైద్యకళాశాలలో 12 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ప్రిన్సిపల్‌ డాక్టర్‌ శశికళ తెలిపారు. ఉస్మానియాలో 296 మంది విద్యార్థులు ఉన్నారు. ఐదు రోజుల క్రితం ఓయూ వైద్య కళాశాలకు చెందిన పీజీ విద్యార్థికి పాజిటివ్ వచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం తమకు లేదని డీఎంఈ రమేశ్‌రెడ్డి, డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌ ఖండించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. హెయిర్‌ కట్‌ చేయించాలన్నా ఆధార్‌ తప్పనిసరి

భుత్వ పథకాలు, మొబైల్‌.. టీవీ కనెక్షన్ల వంటివి పొందడానికి ఆధార్‌ కార్డు తప్పనిసరన్న విషయం అందరికి తెలుసు. కానీ తమిళనాడు ప్రజలకు సెలూన్‌లో జుట్టు కత్తించుకోవడానికి కూడా ఇప్పుడు ఆధార్‌ కార్డు తప్పనిసరైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌లో తాజాగా భారీ సడలింపులు ఇచ్చారు. ఈ క్రమంలో సెలూన్‌లు కూడా తెరుచుకునేందుకు అనుమతిచ్చారు. అయితే సెలూన్‌కు వచ్చే కస్టమర్ల వివరాలను యజమానులు సేకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. విద్యుత్‌ తీగలపై నడిచి.. చెట్టుకొమ్మని తీసి

 ఈదురు గాలులకు విద్యుత్‌ తీగలపై పడిన చెట్టుకొమ్మను తొలగించడానికి ఓ కాంట్రాక్ట్‌ ఉద్యోగి సాహసం చేశాడు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట్‌ మండలం నిజాంపూర్‌లో గాలి ఉద్ధృతికి ఓ చెట్టు కొమ్మ విద్యుత్‌ తీగలపై పడింది. సమాచారం అందుకున్న విద్యుత్‌ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. విద్యుత్‌ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగి నూర్‌.. స్తంభం ఎక్కి విద్యుత్‌ తీగలపై నడుచుకుంటూ వెళ్లి కొమ్మను తొలగించాడు. ఆ యువకుడు క్షేమంగా కిందికి దిగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. కిక్కు కోసం క్లిక్‌.. మద్యం విక్రయాలకో పోర్టల్‌!

దాదాపు రెండు నెలల పాటు మద్యం దొరక్క అల్లాడిపోయిన మందుబాబులకు ఒడిశా ప్రభుత్వం ఓ కిక్కిచ్చే వార్త చెప్పింది. ఇప్పటికే మద్యం హోం డెలివరీని ప్రారంభించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం.. పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఏకంగా ఓ పోర్టల్‌నే ప్రారంభించింది. అటు తాగేందుకు మందుబాబులు, అమ్మేందుకు ఇటు విక్రయదారులు ఇబ్బంది పడకుండా ఈ చర్యలు చేపట్టినట్లు చెబుతున్నారు ఒడిశా స్టేట్‌ బెవరేజస్‌ కార్పొరేషన్‌ (ఓఎస్‌బీసీ) అధికారులు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మోసగించిన ప్రియుడు.. నటి ఆత్మహత్య

కన్నడ నటి చందన ఆత్మహత్య చేసుకున్నారు. బెంగళూరులోని తన నివాసంలో విషం తాగి ప్రాణాలు తీసుకున్నారు. ఈ తుది నిర్ణయం తీసుకోవడానికి ప్రియుడు దినేష్‌ కారణమని సెల్ఫీ వీడియోలో చెప్పారు. మే 28న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నటి కావాలనే కలతో హసన్‌ జిల్లా బేలూరుకు చెందిన చందన బెంగళూరుకు వచ్చారు. కన్నడ బుల్లితెరతోపాటు పలు ప్రకటనలు, సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు పోషించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. నువ్వన్నా.. నీ ఆటన్నా నాకిష్టం కోహ్లీ!

‘ఛేదన రారాజు’ విరాట్‌ కోహ్లీ అసాధారణ క్రికెటరని ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్‌స్మిత్‌ ప్రశంసించాడు. అతనంటే తనకెంతో ఇష్టమని పేర్కొన్నాడు. తెలుపు బంతి క్రికెట్లో అతడి ఘనతలు అమోఘమని మెచ్చుకున్నాడు. మంగళవారం స్మిత్‌ పుట్టిన రోజు కావడం విశేషం. ‘చూడండి, నేను విరాట్‌ను ఎంతగానో ఇష్టపడతాను. అతడో అద్భుత ఆటగాడు. అతడి రికార్డుల్ని పరిశీలించండి. నమ్మశక్యం కాకుండా ఉంటాయి. భారత క్రికెట్‌ కోసం అతడెంతో చేశాడు. కోహ్లీ ఆటతీరును చూస్తుంటే దేశ క్రికెట్‌పై అభిరుచి వ్యక్తమవుతుంది. ఆటను మెరుగుపర్చుకొనేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. కాలం గడిచే కొద్దీ అతడి దేహం ఎలా రూపాంతరం చెందిందో మీకు తెలుసు’ అని స్మిత్‌ అన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.