close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 25/05/2020 20:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9PM

1. వరంగల్‌ కేసులో సంచలన విషయాలు

సంచలనం సృష్టించిన వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట మృత్యుబావి ఘటనను వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసులు ఛేదించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుడిని అరెస్ట్‌ చేశారు. బిహార్‌కు చెందిన సంజయ్‌ కుమార్‌ యాదవ్‌ (24) ఈ ఘోరానికి పాల్పడ్డాడని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ రవీందర్‌ తెలిపారు. నిందితుడిని సోమవారం మీడియా ముందు ప్రవేశ పెట్టి.. ఈ కేసుకు సంబంధించిన పూర్వాపరాలను వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. వేలంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: వైవీ

తితిదే భూముల విక్రయంపై ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి స్పష్టంచేశారు. వేలానికి సంబంధించి ఎలాంటి విధివిధానాలూ రూపొందించలేదని తెలిపారు. ఎలాంటి నిర్ణయమూ తీసుకోకుండానే కొందరు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. తదుపరి బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. తితిదే ఆస్తుల విక్రయ వ్యవహారంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ ఆయన మీడియాతో మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* తితిదే నిర్ణయాన్ని తప్పుబట్టిన వైకాపా ఎంపీ

3. శ్రీశైలం దేవస్థానంలో మరో అవినీతి

శ్రీశైలం దేవస్థానంలో మరో అవినీతి వెలుగు చూసింది. ఆలయ దర్శనం టికెట్లు, ఆర్జిత సేవల టికెట్ల విక్రయాల్లో గోల్‌మాల్‌ జరిగినట్లు అధికారులు గుర్తించారు. గడిచిన మూడేళ్ల నుంచి ఇప్పటి వరకు రూ.1.40 కోట్లను బ్యాంకుల తరఫున పనిచేసే పొరుగు సేవల సిబ్బంది ఈ అవినీతికి పాల్పడినట్లు దేవస్థానం ఈవో కేఎస్‌ రామారావు పేర్కొన్నారు. బాధ్యులపై క్రిమినల్‌ కేసు నమోదు చేసి పూర్తిస్థాయి విచారణ చేయనున్నట్లు ఆయన తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. పాక్‌ గూఢచారి పావురం దొరికింది..

ఒక అనుమానాస్పద గూఢచార పావురాన్ని అంతర్జాతీయ సరిహద్దులో పట్టుకున్నట్టు భద్రతాదళ అధికారులు సోమవారం తెలిపారు. వివరాల్లోకి వెళితే జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లా మన్యారి గ్రామస్థులు హిరానగర్‌ సెక్టార్‌ వద్ద దొరికిన ఒక పావురాన్ని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. అది పాకిస్థాన్‌ బోర్డర్‌ వైపు ఎగురుతుండగా కింద పడిపోయిందని వారు తెలిపారు. దాన్ని క్షుణ్ణంగా పరిశీలించగా దాని కాళ్లకు ఒక చిన్న రింగు ఉండటం పోలీసులు గుర్తించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. నేను క్వారంటైన్‌లో ఉంటే ఎలా?:గౌడ

 ‘నేను మంత్రిని, క్వారంటైన్ నుంచి నాకు మినహాయింపు ఉంది’ అంటూ విమానం దిగిన వెంటనే కేంద్ర మంత్రి సదానంద గౌడ నేరుగా ఇంటికే వెళ్లిపోయారు. దేశీయంగా విమానాల రాకపోకలు ప్రారంభం కావడంతో ఆయన దిల్లీ నుంచి సోమవారం బెంగళూరు చేరుకున్నారు. మంత్రి వద్ద కొవిడ్-19 నెగిటివ్ రిపోర్టు ఉందని, ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉంటారని ఆయన సహాయకులు ఒకరు మీడియాకు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఆకలి రాజ్యం: రైల్వేస్టేషన్‌లో ఆహారం లూటీ

కరోనా వైరస్‌ విజృంభణ.. లాక్‌డౌన్‌.. ఉపాధి కోల్పోవడం వెరసి వలస కూలీలు, చిరు ఉద్యోగులు, చిన్న చిన్న వ్యాపారస్థుల పాలిట శరఘాతమై కూర్చొంది. వీరిలో వలస కూలీల పరిస్థితి మరింత దయనీయం. పని చేస్తే కానీ, పట్టెడన్నం తినే వీరు పని దొరక్క పస్తులున్నారు. స్వగ్రామాలకు కాలినడకన బయలుదేరారు. ఇక వలస కూలీల కోసం ప్రభుత్వం శ్రామిక రైళ్లను నడుపుతున్నా, ప్రయాణం సమయంలో సరిగా ఆహారం దొరకని పరిస్థితి. అలాంటి దయనీయ పరిస్థితికి ఉదాహరణే ఈ వీడియో. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. శాంసంగ్‌ నుంచి మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్‌ మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ భారత్‌లో విడుదల చేయనుంది. గెలాక్సీ శ్రేణిలో ఏ31 పేరుతో దీన్ని తీసుకొస్తోంది. మే 4నుంచి ఈ ఫోన్‌ విక్రయాలను ప్రారంభించనుంది. ఈ సందర్భంగా ఈ ఫోన్‌కు సంబంధించిన ప్రత్యేకతలను వెల్లడించింది. గెలాక్సీ ఏ31 6.4 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ సూపర్‌అమోల్డ్‌ ఇన్ఫినిటీ యూ డిస్‌ప్లేతో రానుంది. ఇక ఇందులో మీడియా టెక్‌ హీలియో పీ65 ప్రాసెసర్‌ను వినియోగించనట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. టీ20 ప్రపంచకప్‌ను వాయిదా వేయొద్దు

అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో నిర్వహించాల్సిన టీ20 ప్రపంచకప్‌ను వాయిదా వేయొద్దని ఐసీసీ అధికారులను పాకిస్థాన్‌ హెడ్‌కోచ్‌ మిస్బా ఉల్‌ హక్‌ కోరాడు. ప్రస్తుత పరిస్థితులన్నీ సద్దుమణిగితే ఈ మెగా టోర్నీతోనే క్రికెట్‌కు మళ్లీ ఆదరణ లభిస్తుందని చెప్పాడు. తాజాగా మిస్బా ఓ యూట్యూబ్‌ ఛానెల్‌తో మాట్లాడుతూ.. ‘కరోనా వైరస్‌ విజృంభిస్తున్న పరిస్థితుల్లో.. ప్రపంచకప్‌ సమయంలో 16 జట్లకు ఆతిథ్యమివ్వడం కష్టమే’ అని పేర్కొన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. దీపికకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నా..!

తన సతీమణి దీపికా పదుకొణెకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతున్నానని కథానాయకుడు రణ్‌వీర్‌ సింగ్‌ అన్నారు. దీపికను ఇంప్రెస్‌ చేయడానికి ఒకప్పుడు రణ్‌వీర్‌ ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆమెకు పూలు పంపడం, రొమాంటిక్‌ డేట్స్‌ ప్లాన్‌ చేయడం ఇలాంటి చాలానే ఉన్నాయి. ఇద్దరి మధ్య బంధం బలపడుతున్న సమయంలో దీపికకు రణ్‌వీర్‌ ఓ మాటిచ్చారట. తనకోసం ప్రత్యేకంగా భోజనం వండుతానని చెప్పానని, కానీ ఇంత వరకు చేయలేదని తాజాగా ‘గల్లీబాయ్‌’ ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. IN PICS: ‘చిత్రం’ చెప్పే విశేషాలు

పంటలను నమిలేసి నామరూపాల్లేకుండా చేసే మిడతల దండు జైపుర్‌లో సంచరిస్తోంది. ఉత్తర ఆఫ్రికా దేశాల నుంచి ఇరాన్‌, పాకిస్థాన్‌ల మీదుగా ప్రస్తుతం భారత్‌లోకి చొరబడ్డాయి. రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లోకి విస్తరించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.